పీనట్ బటర్.. ఇది చేసే మ్యాజిక్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

పీనట్ బటర్ కేవలం రుచికరమైన ఆహారమే కాదు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాల గని కూడా. ఇందులో ప్రోటీన్, ఫైబర్, మంచి కొవ్వులు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తిని పెంచడానికి.. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మంచి నిద్రకు, గుండె ఆరోగ్యానికి చాలా సహాయపడతాయి.

పీనట్ బటర్.. ఇది చేసే మ్యాజిక్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Peanut Butter

Updated on: Jul 31, 2025 | 9:42 PM

పీనట్ బటర్ కేవలం రుచిగానే కాదు.. ఆరోగ్యకరమైన పోషకాల గని. ఇందులో ప్రోటీన్, శరీరానికి కావాల్సిన మంచి కొవ్వులు, చాలా విటమిన్లు ఉంటాయి. ఇవన్నీ శరీరానికి శక్తినిచ్చి రోజువారీ అవసరాలకు సహాయపడతాయి. అందుకే పీనట్ బటర్‌ ను ఒక మంచి ఆహారంగా చూస్తారు.

గుండె ఆరోగ్యం

ఈ బటర్‌ లో ఉండే సహజ కొవ్వులు గుండెకు చాలా మేలు చేస్తాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గిస్తాయి, తద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని బలంగా చేసి చాలా వ్యాధుల నుండి కాపాడతాయి.

బరువు నియంత్రణ

పీనట్ బటర్‌ లో పేగులు బాగా పనిచేయడానికి కావాల్సిన ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను సరిగా నడిపిస్తుంది. అజీర్తి, గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇందులోని పోషకాలు.. ముఖ్యంగా ఫైబర్, ప్రోటీన్, మంచి కొవ్వులు, రక్తంలో చక్కెర స్థాయిని అదుపు చేస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు దీన్ని తింటే ఆకలిని అదుపు చేసుకోవచ్చు. అనవసరంగా తినకుండా చూసుకోవచ్చు.

మంచి నిద్ర

రాత్రి నిద్రపోయే ముందు ఒక చెంచా పీనట్ బటర్ తింటే మన శరీరానికి కావాల్సిన ప్రశాంతత, నిద్రకు సహాయపడే పోషకాలు అందుతాయి. ఇది నిద్ర నాణ్యతను పెంచుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ అనే పదార్థం మెదడులో సెరోటోనిన్ స్థాయిని పెంచుతుంది. ఇది నిద్ర పట్టేలా చేస్తుంది.

ఇంకా పీనట్ బటర్‌లో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది నరాల వ్యవస్థ సరిగా పనిచేయడానికి చాలా అవసరం. మంచి నిద్ర పట్టడానికి.. అలాగే ఉదయం తేలికగా లేవడానికి ఈ మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది.

కొన్ని అధ్యయనాల ప్రకారం.. పీనట్ బటర్‌ను తరచూ తింటే పెద్ద ప్రేగులో క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇందులో ఉండే అర్జినిన్ అనే అమైనో ఆమ్లం గుండె జబ్బుల నుండి రక్షణ ఇవ్వడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థను బాగా పనిచేయించే ఫైబర్ ఈ బటర్‌లో చాలా ఉండడం వల్ల ఇది ఒక మంచి ఆరోగ్యకరమైన ఆహారంగా గుర్తింపు పొందింది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)