Onions: నెల ఉల్లిపాయ తినకపోతే మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెల్సా..?

|

Jun 07, 2024 | 12:14 PM

ఉల్లిపాయను మీ డైట్​లో ఒక నెల పాటు తీసుకోకపోతే.. మీ శరీరంలో కొన్ని మార్పులు చోటుచేసుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉల్లిపాయల్లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థకు అది చాలా అవసరం. అదే మీరు నెలపాటు ఉల్లిపాయలు తీసుకోకపోవడం కారణంగా బాడీలో ఫైబర్ కంటెంట్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుందంటున్నారు

Onions: నెల ఉల్లిపాయ తినకపోతే మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెల్సా..?
Raw Onions
Follow us on

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనేది మన తెలుగులో ఎప్పట్నుంచో వింటున్న సామెత. ఉల్లిపాయ అనేది ప్రపంచవ్యాప్తంగా వంటల్లో సాధారణంగా ఉపయోగించే ఒక కూరగాయ. బర్గర్‌ల నుండి ఫ్రైస్ వరకు ప్రతిదానికీ రుచి కావాలంటే ఉల్లి ఉండాల్సిందే. ఇక బయట బజ్జీలు, గారెలు ఏం తిన్నా.. పక్క టచ్చింగ్ కోసం పచ్చి ఉల్లి ఉండాల్సిందే. అయితే కొందరికి దీని రుచి నచ్చకపోవచ్చు. పచ్చి ఉల్లిని తిన్నాక నోటి దుర్వాసన రావడానికి కూడా ఇందుకు కారణం కావొచ్చు. మీరు 1 నెల ఉల్లిపాయలు తినకపోతే ఏమి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

పోషకాహార పవర్‌హౌస్:

ఉల్లిపాయలు కేవలం రుచి కోసం మాత్రమే కాదు. అవి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇవన్నీ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

విటమిన్ పవర్:

ఉల్లిపాయల నుంచి విటమిన్ సి, బి6, ఫోలేట్ లభిస్తాయి. బలమైన రోగనిరోధక వ్యవస్థ, కణాల పెరుగుదల, ఆరోగ్యకరమైన జీవక్రియ కోసం ఇవి అవసరం.

యాంటీ ఆక్సిడెంట్:

ఉల్లిపాయలు అల్లైల్ ప్రొపైల్ డైసల్ఫైడ్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉన్నాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి.

ఫైబర్‌కు ఆనియన్ గుడ్ సోర్స్:

ఉల్లిపాయలు డైటరీ ఫైబర్‌కు మంచి సోర్స్ అని చెప్పాలి. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు ఫైబర్ అవసరం. వాటిని తినడం ఆపేస్తే  మలబద్ధకం లేదా ఇతర జీర్ణ సమస్యలకు దారి తీయొచ్చు.

పోషకాహార లోపం :

ఉల్లిపాయల్లో అల్లిసిన్, క్వెర్సెటిన్ ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను ఉల్లి కలిగి ఉంది. ఇన్ని గుణాలున్న ఉల్లిని మీరు తీసుకోవడం మానేస్తే.. కాలక్రమేణా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

ఉల్లిపాయను తీసుకోకపోవడం వల్ల వచ్చే సమస్యలు:

ఉల్లిపాయలు అవసరమైన పోషకాలతో నిండి ఉన్నాయి. మీ ఆహారం నుండి వాటిని తొలగించడం వలన ఆ పోషకాల లోపాలకు దారి తీస్తుంది. ఉల్లిపాయలను దూరంగా పెట్టడం వల్ల మాంగనీస్, పొటాషియం వంటి ఖనిజాలతో పాటు విటమిన్లు సి, బి6, ఫోలేట్ వంటివి శరీనానికి అందవు. దీంతో రోగనిరోధక వ్యవస్థ బలహీనమవుతుంది. అలసట, రక్తం గడ్డకట్టడం, ఎర్ర రక్త కణాల డ్యామేజ్ అవ్వడం వంటి సమస్యలు వస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

(ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.)