AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెదడు చురుకుగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పకుండా తినాల్సిందే..!

మన మెదడు ఆరోగ్యం మన ఆహారంపై ఆధారపడి ఉంటుంది. సరైన ఆహారం తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆలోచనా సామర్థ్యం మెరుగుపడతాయి. ఒత్తిడి, అలసట తగ్గి మెదడు చురుకుగా ఉంటుంది. కొన్ని ప్రత్యేక ఆహారాలు మెదడు ఆరోగ్యాన్ని కాపాడి.. దీర్ఘకాలంలో వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

మెదడు చురుకుగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పకుండా తినాల్సిందే..!
Healthy Brain
Prashanthi V
|

Updated on: Sep 02, 2025 | 7:52 PM

Share

మనం తీసుకునే ఆహారం మన మెదడు పనితీరుకు చాలా ముఖ్యం. మనం తినేది మన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆలోచనా సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. సరైన ఆహారం మెదడును చురుకుగా ఉంచుతుంది. మెదడు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఆరోగ్యకరమైన మెదడుకు ఆరోగ్యకరమైన శరీరం అవసరం. సరైన ఆహారం తీసుకోవడం వల్ల మెదడులో వాపు తగ్గుతుంది. ఒత్తిడి, అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే మెదడులో ఉండే న్యూరోట్రాన్స్‌మిటర్లైన సెరోటోనిన్, డోపమైన్‌లను బ్యాలెన్స్‌గా ఉంచడానికి ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, జింక్, మెగ్నీషియం, అమైనో ఆమ్లాలు అవసరం.

మెదడుకు మేలు చేసే ఆహారాలు

  • కొవ్వు చేపలు.. సార్డిన్స్, సాల్మన్, మాకెరెల్ వంటి చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
  • ఆకుకూరలు.. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు నాడీ వ్యవస్థకు మద్దతు ఇస్తాయి.
  • గుడ్లు.. ఇవి మెదడుకు హాని జరగకుండా రక్షణ కల్పిస్తాయి.
  • డ్రై ఫ్రూట్స్.. వాల్‌నట్స్, బాదం, చియా, అవిసె, గుమ్మడికాయ గింజలలో విటమిన్ ఇ, జింక్, సెలీనియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి.
  • బెర్రీలు, అవకాడో.. వీటిలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.
  • ధాన్యాలు.. బ్రౌన్ రైస్, గోధుమ, ఓట్స్ వంటివి మెదడుకు శక్తిని అందిస్తాయి.
  • డార్క్ చాక్లెట్.. ఇందులో ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
  • సుగంధ ద్రవ్యాలు.. పసుపు, లవంగాలు, అలాగే పండ్లు, కూరగాయలు మెదడుకు మంచివి.
  • ప్రోబయోటిక్స్.. పెరుగు, మజ్జిగ వంటివి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

నీరు కూడా ముఖ్యం

మంచి ఆహారంతో పాటు.. ప్రతిరోజూ పుష్కలంగా నీరు తాగడం కూడా మెదడుకు చాలా అవసరం. మెదడులో 75 శాతం నీరు ఉంటుంది. తగినంత నీరు తాగకపోతే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, పుదీనా షర్బత్ వంటి డ్రింక్స్ శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లను అందిస్తాయి. అలాగే పుచ్చకాయ, నారింజ, దోసకాయ వంటి నీరు ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడం మంచిది. రోజుకు కనీసం 6 నుంచి 8 గ్లాసుల నీరు తాగడం అవసరం.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us
విమానంలో ప్రయాణికుడి హంగామా.. సీటుకు టేప్‌తో చుట్టేసారు!
విమానంలో ప్రయాణికుడి హంగామా.. సీటుకు టేప్‌తో చుట్టేసారు!
బ్యాంక్ అకౌంట్ లేకున్నా క్రెడిట్ కార్డు తీసుకోవచ్చా?
బ్యాంక్ అకౌంట్ లేకున్నా క్రెడిట్ కార్డు తీసుకోవచ్చా?
పిచ్చెక్కించే సూపర్ ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త ఈవీ
పిచ్చెక్కించే సూపర్ ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త ఈవీ
ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా..? సంపద నిలవకపోవడానికి ఇవే కారణమని..
ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా..? సంపద నిలవకపోవడానికి ఇవే కారణమని..
మెటాలిక్​ గ్రే స్ట్రాప్‌తో బోట్‌ స్మార్ట్‌వాచ్‌.. స్పెషాలిటీ ఇదే
మెటాలిక్​ గ్రే స్ట్రాప్‌తో బోట్‌ స్మార్ట్‌వాచ్‌.. స్పెషాలిటీ ఇదే
యాపిల్ మాజీ సీఈవో నికర ఆస్తి విలువ ఎంత? ఇక ఆయన కొత్త రోల్ ఏంటి?
యాపిల్ మాజీ సీఈవో నికర ఆస్తి విలువ ఎంత? ఇక ఆయన కొత్త రోల్ ఏంటి?
ఏం వైస్ కెప్టెన్ ఏంటి సంగతి.. బుడ్డోడిని కెలికిన తిలక్ వర్మ
ఏం వైస్ కెప్టెన్ ఏంటి సంగతి.. బుడ్డోడిని కెలికిన తిలక్ వర్మ
స్మార్ట్‌వాచ్‌ ఫీచర్లే సూపర్ అంటే.. ధర ఇంత తక్కువా
స్మార్ట్‌వాచ్‌ ఫీచర్లే సూపర్ అంటే.. ధర ఇంత తక్కువా
చిల్లర మాటలు.. కాంగ్రెస్‌ది థర్డ్ క్లాస్ పాలన: కేసీఆర్
చిల్లర మాటలు.. కాంగ్రెస్‌ది థర్డ్ క్లాస్ పాలన: కేసీఆర్
కప్ టీమిండియా గెలిచినా.. పట్టుకెళ్లేది మాత్రం పాకిస్థానోడే!
కప్ టీమిండియా గెలిచినా.. పట్టుకెళ్లేది మాత్రం పాకిస్థానోడే!