Star Fruit Health Benefits: ఆధునిక కాలంలో మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే.. సమతుల్య, పోషకమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అందుకనే మనం తినే ఆహారంలో పుట్టగొడుగులు (Mushrooms), బ్లూబెర్రీస్(Blueberries), కాయధాన్యాలు, ఆకుకూరలు వంటి వాటిని చేర్చుకోమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వీటిల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు నిండి ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. అయితే వీటిల్లానే మరో సూపర్ ఫుడ్ కూడా ఉందని ప్రముఖ పోషకాహార నిపుణులు న్మామి అగర్వాల్ చెప్పారు. కారాంబోలా, లేదా స్టార్ ఫ్రూట్ ఉష్ణమండల ఆగ్నేయాసియాకు చెందిన చెట్టు జాతి. ఇది ఒక సూపర్ ఫుడ్ అని అంటున్నారు. పండ్లలో స్టార్ ఫ్రూట్ ఒక ప్రత్యకమైన ఆకారంను కలిగి ఉంటుంది. నక్షత్ర ఆకారంలో కనిపించే ఈ పండు జ్యూసీ జ్యుసీగా ఉండడమే కాదు బాగా పండిన పండ్లు పసుపురంగులోకి మారి తియ్యగా ఉంటాయి. పచ్చి పండ్లు పుల్లగా ఉంటాయి. పోషకాహార నిపుణుడు న్మామి అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ సూపర్‌ఫుడ్ ప్రయోజనాలను పంచుకున్నారు. ఈ స్టార్ ప్రూట్ లో విటమిన్ ఎ, బి , సి పుష్కలంగా ఉన్నాయని ఆమె చెప్పింది.
స్టార్ ప్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు:
అధికంగా ఫైబర్: ఈ పండులో ఎక్కువ శాతం ఫైబర్, తక్కువ కేలరీలు నిండి ఉంటుంది. ఫైబర్ జీర్ణవ్యవస్థకు మంచిది. అంతేకాదు ఈ పండు ప్రేగు శుభ్రపరుస్తుంది.
కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది: స్టార్ ఫ్రూట్స్ మీ కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి. అంతేకాదు రక్తంలోని పేరుకున్న కొవ్వును కూడా తొలగిస్తుంది.
బరువు తగ్గడానికి మంచి సహాయకారి: పోషకాలతో నిండి. తక్కువ కేలరీలు కలిగిన ఈ స్టార్ ఫ్రూట్ బరువు తగ్గడానికి అనువైన పండు. జీవక్రియను పెంచుతుంది. శరీరంలోని ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.
గుండెకు మంచిది: సోడియం, పొటాషియం, ఇతర ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న స్టార్‌ఫ్రూట్స్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.
రోగనిరోధక శక్తినిచ్చే మంచి బూస్టర్: స్టార్‌ఫ్రూట్‌లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. స్టార్ ఫ్రూట్‌లో మెగ్నీషియం, ఐరన్, జింక్, మాంగనీస్, పొటాషియం . ఫాస్పరస్ ఉన్నాయి.
Also Read: Train Ticket: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. క్యూ ఆర్ కోడ్ తో రైల్వే టికెట్లు..