
మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందాలంటే ఆహారం సరైన విధంగా జీర్ణం కావాలి. కడుపు ఆరోగ్యం బాగుంటేనే మనం ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉంటాం. అందుకే జీర్ణక్రియను మెరుగుపరచి గట్ హెల్త్‌ను కాపాడే ఫుడ్స్ ని తీసుకోవాలి. ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లంలో సహజంగానే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది జీర్ణక్రియను సులభతరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. వాంతులు, కడుపులో ఉబ్బరం లాంటి సమస్యలను తగ్గించడంలో అల్లం బెస్ట్‌గా పనిచేస్తుంది. అల్లంలో ఉండే జింజెరాల్ అనే పదార్థం జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. అందుకే ఫుడ్‌లో అల్లం వాడటం లేదా అల్లం టీ తాగడం వల్ల కడుపు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
చియా గింజల్లో ఉండే ఫైబర్, ప్రోటీన్ కడుపు ఆరోగ్యాన్ని కాపాడటంలో కీ రోల్ ప్లే చేస్తాయి. ఇవి కడుపులో ప్రీబయోటిక్ జెల్‌ను తయారు చేసి మంచి బ్యాక్టీరియాకు పోషకాలను అందిస్తాయి. చియా గింజల్లోని ఫైబర్ మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.
గ్రీన్ టీలో ఉండే EGCG (ఎపిగ్యాలోకాటెచిన్ గ్యాలేట్) అనే పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్ కడుపులోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. ఇది మంచి బ్యాక్టీరియా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. గ్రీన్ టీలో ఉండే పోలీఫినాల్స్ ప్రీబయోటిక్‌లుగా పనిచేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
సోంపులో అనిథోల్ అనే ముఖ్యమైన పదార్థం ఉంటుంది. ఇది గ్యాస్, బ్లోటింగ్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. భోజనం చేశాక కొద్దిగా సోంపు నమిలితే జీర్ణక్రియ ఈజీగా జరిగి కడుపు హాయిగా ఉంటుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)