చలికాలం ప్రారంభమైంది. ఈ సమయంలో వెన్నునొప్పి, కీళ్ల నొప్పులతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఆర్థరైటిస్ రోగులకు అంతకుముందు చేసిన సర్జరీ ప్రాంతాలలో కూడా సమస్యలు మొదలవుతాయి. చలికి ఎముకలు బిగుసుకుపోతాయి. దీని వల్ల లేచి కూర్చోవడం చాలా కష్టం అవుతుంది. అటువంటి పరిస్థితిలో ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉండటానికి ఆహారంలో మార్పులు చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యమైన పోషకాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఎముకలు దృఢంగా ఉండటానికి కాల్షియం, విటమిన్ డి చాలా ముఖ్యమైనవి. అయితే, ఇది కాకుండా ఎముకల ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. ఎముకలను ఎలా దృఢంగా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా పోషకాలను చేర్చుకోండి..
కాల్షియం: ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం అవసరం. శరీరంలో కాల్షియం లోపం ఉన్నవారి ఎముకలు బలహీనపడటం ప్రారంభమవుతంది. అందువల్ల ఆహారంలో కాల్షియం సమృద్ధిగా ఉండే వాటిని చేర్చుకోవాలి. కాల్షియం లోపాన్ని తీర్చడానికి పాల ఉత్పత్తులు, జున్ను, పెరుగు వంటి పాల ఉత్పత్తులను తినాలి. ఇది కాకుండా కాల్షియం కోసం బాదం, సోయా లాంటివి తీసుకోవాలి.
విటమిన్ డి: ఎముకలు దృఢంగా ఉండాలంటే విటమిన్ డి అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం అవసరం. కాల్షియం పూర్తి శోషణకు విటమిన్ డి అవసరం. విటమిన్ డి చాలా వరకు సూర్యకాంతి నుంచి లభిస్తుంది. ఇది కాకుండా విటమిన్ సి, సాల్మన్ చేపలు, నారింజ, పుట్టగొడుగులు, గుడ్లలో కూడా లభిస్తుంది.
ప్రొటీన్ : ఎముకలు దృఢంగా ఉండాలంటే ప్రొటీన్ కూడా అవసరం. ప్రోటీన్ తీసుకోవడం ఎముక పగుళ్లను నయం చేయడంలో సహాయపడుతుంది. దీని కోసం మీరు పాల ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించాలి. ప్రోటీన్ లోపాన్ని తీర్చడానికి పాలు, జున్ను, పెరుగు లాంటివి తినాలి. అదే సమయంలో గుమ్మడికాయ గింజలు, వేరుశెనగలు, టోఫు, జామ, రొయ్యలలో కూడా ప్రోటీన్ కనిపిస్తుంది.
ఇతర విటమిన్లు – మినరల్స్: మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఎముకలను బలంగా చేయడానికి అవసరం. ఆహారంలో బచ్చలికూర, సముద్రపు చేపలు, సోయాబీన్స్ నుంచి ఈ ఖనిజాలను పొందవచ్చు. అదే సమయంలో విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఎ కూడా ఎముకల ఆరోగ్యానికి అవసరం. ఇందుకోసం సిట్రస్ పండ్లు, టొమాటోలు, క్యారెట్లు, పచ్చి కూరగాయలు, మాంసం, గుడ్లు, బాదం, జీడిపప్పు వంటివి తినవచ్చు.