Vitamin D: మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే విటమిన్ డీ లోపమే.. నివారణ కోసం ఏమి చేయాలంటే

|

Oct 07, 2024 | 10:12 AM

నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. విటమిన్ డి లోపం మహిళల్లో గుండె ఆగిపోవడం, గుండెపోటు, స్ట్రోక్, మధుమేహం, అధిక రక్తపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. గర్భధారణ సమయంలో కాల్షియం, విటమిన్ డి లోపాన్ని ప్రీ-ఎక్లాంప్సియా అని పిలుస్తారు. అయితే ఈ సమయంలో సంభవించే మధుమేహాన్ని గర్భధారణ మధుమేహం అంటారు. కాల్షియం లోపం తర్వాత కాలంలో ఆస్టియోపోరోసిస్ సమస్యకు దారితీస్తుంది.

Vitamin D: మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే విటమిన్ డీ లోపమే.. నివారణ కోసం ఏమి చేయాలంటే
Vitamin D Deficiency
Follow us on

మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్ డి చాలా ముఖ్యమైన పోషకం. ఇది లోపిస్తే శరీరంలో చాలా సమస్యలు ఏర్పడతాయి. అయితే భారతదేశంలో పురుషుల కంటే స్త్రీలు ఈ విటమిన్‌ లోపం బారిన ఎక్కువగా పడుతున్నారు. వయసు పెరిగే కొద్దీ ఈ విటమిన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే గర్భం దాల్చిన తర్వాత.. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మహిళల్లో సాధారణంగా విటమిన్ డి, కాల్షియం, ఐరన్ లోపించడం ప్రారంభమవుతుంది. వీటిని పట్టించుకోకపోతే దీర్ఘకాలంలో చాలా సమస్యలు వస్తాయి.

నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. విటమిన్ డి లోపం మహిళల్లో గుండె ఆగిపోవడం, గుండెపోటు, స్ట్రోక్, మధుమేహం, అధిక రక్తపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. గర్భధారణ సమయంలో కాల్షియం, విటమిన్ డి లోపాన్ని ప్రీ-ఎక్లాంప్సియా అని పిలుస్తారు. అయితే ఈ సమయంలో సంభవించే మధుమేహాన్ని గర్భధారణ మధుమేహం అంటారు. కాల్షియం లోపం తర్వాత కాలంలో ఆస్టియోపోరోసిస్ సమస్యకు దారితీస్తుంది. ఐరన్ లోపం వల్ల శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది. దీని కారణంగా మహిళల్లో హిమోగ్లోబిన్ తగ్గడం ప్రారంభమవుతుంది.

విటమిన్ డి లోపం ఎందుకు వస్తుంది?

  1. ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండడం వల్ల మహిళల్లో విటమిన్ డి లోపం పెరుగుతోంది.
  2. చాలా మంది మహిళలు తమ శరీరమంతా కప్పి ఉంచే దుస్తులను ధరిస్తారు. దీని కారణంగా శరీరం సూర్య కిరణాలను గ్రహించడం సాధ్యం కాదు. ఇది మహిళల్లో విటమిన్ డి లోపానికి కారణం అవుతుంది.
  3. పిల్లలకు తల్లిపాలు ఇచ్చే తల్లులు కాల్షియం లోపంతో బాధపడుతున్నారు. శరీరంలో విటమిన్ డి శోషణకు కాల్షియం చాలా ముఖ్యమైనది. కాల్షియం లోపం కూడా విటమిన్ డికి కారణం అవుతుంది.

విటమిన్ డి లోపం వల్ల వచ్చే సమస్యలు

  1. విటమిన్ డి లోపం వల్ల మహిళలు తరచుగా అలసట, బలహీనతతో బాధపడతారు. విటమిన్ డి లోపం వల్ల కూడా విపరీతమైన అలసట కలుగుతుంది.
  2. విటమిన్ డి లోపం రోగనిరోధక శక్తిని కూడా బలహీనపరుస్తుంది. దీని కారణంగా మహిళలు తరచుగా అనారోగ్యంతో ఉంటారు. ఏదైనా వ్యాధి సంక్రమణకు గురవుతారు.
  3. విటమిన్ డి లోపం కారణంగా మహిళల్లో ఒత్తిడి, డిప్రెషన్ లక్షణాలు తరచుగా కనిపిస్తాయి.
  4. విటమిన్ డి లోపం వల్ల కూడా ఎముకలు బలహీనపడతాయి. దీని కారణంగా ఎముకలు, దంతాలు బలహీనపడతాయి. చేతులు, కాళ్ళ కీళ్లలో నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు.

విటమిన్ డి లోపాన్ని ఎలా అధిగమించాలి

  1. విటమిన్ డి ఉత్తమ మూలం సూర్య కిరణాలు. కనుక ప్రతిరోజూ ఉదయం సూర్యకాంతిలో అరగంట గడపండి.
  2. విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. తినే ఆహారంలో ఎక్కువ గుడ్లు, చేపలు, పాలు చేర్చుకోండి.
  3. విటమిన్ డి స్థాయి గణనీయంగా తగ్గినట్లయితే విటమిన్ డి ఔషధాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా వారానికి ఒకసారి మాత్రమే తీసుకుంటే మంచి ఫలితాలను పొందుతారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..