Vitamin A Mega Drive: చంటి పిల్లల తల్లిదండ్రులకు అలర్ట్‌!.. విటమిన్‌-ఏ మెగా డ్రైవ్‌ గురించి ఈ విషయాలు తెలుసుకోండి!

మీ పిల్లలకు ప్రభుత్వం అందించే విటమిన్‌-ఏ డోస్‌ ఎందుకు ఇస్తారో తెలుసా?.. కళ్ల ఆరోగ్యం నుంచి ఎదుగుదల వరకు ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం చిన్నారులకు విటమిన్‌-ఏ అందించే కార్యక్రమాలపై తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలివి. విటమిన్ ఏ అనేది వాక్సినేషన్ కాదు.. ఇది లిక్విడ్ రూపంలో అందిస్తారు. 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఆగస్టు 15, 2026 లోపు ఈ డోసు వేయించాల్సి ఉంటుంది?.. అయితే ఎవరెవరు వేయించాలి అనే వివరాలు తెలుసుకోండి..

Vitamin A Mega Drive: చంటి పిల్లల తల్లిదండ్రులకు అలర్ట్‌!.. విటమిన్‌-ఏ మెగా డ్రైవ్‌ గురించి ఈ విషయాలు తెలుసుకోండి!
Vitamin A Mega Drive

Updated on: Aug 13, 2026 | 10:03 PM

చిన్నారుల ఎదుగుదలలో విటమిన్‌-ఏ కీలకమైన పోషకం. ముఖ్యంగా కంటి చూపు, శరీర కణాల సాధారణ పనితీరు, ఎదుగుదల, రోగనిరోధక వ్యవస్థకు ఇది అవసరం. విటమిన్‌-ఏ లోపం తీవ్రమైతే రాత్రిపూట సరిగా కనిపించకపోవడం వంటి సమస్యలు రావచ్చు. అందుకే భారత ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్‌ ద్వారా ఐదేళ్లలోపు పిల్లలకు విటమిన్‌-ఏ సప్లిమెంటేషన్‌ అందిస్తోంది. ఇప్పటికే విటమిన్ ఏ డ్రాప్స్ ను పిల్లలకు అందిస్తున్న పేరెంట్స్ ఈ విషయంలో వైద్యుల సలహా తీసుకోవాలి.

1. ఏ పిల్లలకు విటమిన్‌-ఏ ఇస్తారు?

ప్రభుత్వ విటమిన్‌-ఏ సప్లిమెంటేషన్‌ కార్యక్రమం ప్రధానంగా 9 నెలల నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లల కోసం ఉంటుంది. పిల్లలకు నిర్ణీత వ్యవధిలో విటమిన్‌-ఏ డోసులు అందిస్తారు.

2. విటమిన్‌-ఏ ఎందుకు ముఖ్యమంటే?

విటమిన్‌-ఏ కళ్ల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా శరీర కణాల సాధారణ పనితీరు, ఎదుగుదల, అభివృద్ధికి అవసరం. దీని లోపం వల్ల రాత్రిపూట చూపు తగ్గడం వంటి సమస్యలు రావచ్చు. తీవ్రమైన లోపం చికిత్స లేకుండా కొనసాగితే చూపుపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.

3. ప్రభుత్వం ఎన్ని డోసులు ఇస్తుంది?

ప్రస్తుత నేషనల్ హెల్త్ మిషన్ మార్గదర్శకాల ప్రకారం పిల్లలకు 5 సంవత్సరాల వయస్సు వరకు మొత్తం 9 డోసులు ఇవ్వాలని సూచిస్తున్నారు. 9 నెలల వయస్సులో మొదటి డోస్‌, ఆ తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి డోస్‌ ఇస్తారు.

4. డోస్‌ పరిమాణం ఎంత?

9 నెలల వయస్సులో 1 లక్ష IU (1 ml) విటమిన్‌-ఏ ఇస్తారు. 1 నుంచి 5 సంవత్సరాల మధ్య పిల్లలకు 2 లక్షల IU (2 ml) డోస్‌ ఇస్తారు. అయితే తల్లిదండ్రులు స్వయంగా సిరప్‌ కొనుగోలు చేసి డోస్‌ నిర్ణయించకూడదు; ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది సూచనల మేరకే ఇవ్వాలి.

5. మెగా డ్రైవ్‌లో తల్లిదండ్రులు ఏం చేయాలి?

ప్రభుత్వం నిర్వహించే విటమిన్‌-ఏ కార్యక్రమంలో అర్హత ఉన్న చిన్నారులకు ఆరోగ్య సిబ్బంది ద్వారా సప్లిమెంటేషన్‌ అందిస్తారు. ఇప్పటికే ఏ డోసులు తీసుకున్నారో తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్య రికార్డును చూసుకోవాలి. డోస్‌ మిస్‌ అయిందా లేదా అనే సందేహం ఉంటే సంబంధిత ANM, ఆశా కార్యకర్త లేదా ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించడం మంచిది.

6. విటమిన్‌-ఏతో పాటు ఆహారం కూడా ముఖ్యం

విటమిన్‌-ఏ సప్లిమెంటేషన్‌తో పాటు పిల్లలకు పోషకాహారం అందించడం కూడా చాలా ముఖ్యం. ఆకుకూరలు, పసుపు లేదా నారింజ రంగు కూరగాయలు, క్యారెట్‌, బొప్పాయి వంటి విటమిన్‌-ఏకు సంబంధించిన ఆహారాలను వయస్సుకు తగిన విధంగా పిల్లల ఆహారంలో చేర్చవచ్చు.

గమనిక:
ఈ కథనం ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమం, నేషనల్ హెల్త్ మిషన్ మార్గదర్శకాలు మరియు అందుబాటులో ఉన్న ప్రజారోగ్య సమాచారంపై ఆధారపడి రూపొందించబడింది. పిల్లలకు విటమిన్‌-ఏ డోస్‌ను తల్లిదండ్రులు స్వయంగా నిర్ణయించకూడదు. ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది/వైద్యుల సూచనల మేరకు మాత్రమే ఇవ్వాలి. ఈ కథనంలోని సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే వ్యక్తిగత వైద్య నిర్ణయాలకు సంస్థ బాధ్యత వహించదు. పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన సందేహాల కోసం సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించండి.

Loading...
Unable to load recommendations.
Follow Us