Eyeglasses Cleaning: కళ్లద్దాలను శుభ్రం చేయాలా.. అయితే టూత్ పేస్ట్ ని ఇలా వాడండి!

|

Sep 22, 2023 | 12:53 PM

ఇప్పుడు అందరూ ఫ్యాషన్ గా కళ్లద్దాలను వాడుతున్నారు. కొంత మంది దృష్టి లోపం కారణంగా కళ్లద్దాలను ఉపయోగిస్తున్నారు. మరికొంత మంది కాంటాక్ట్ లెన్స్ లను ఉపయోగిస్తుంటారు. కానీ కాంటాక్ట్ లెన్స్ ని ధరించడం చాలా కష్టం. కళ్లకు చికాకుగా ఉంటాయి. దీంతో చాలా మంది కళ్లద్దాలనే యూజ్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దీంతో రంగు రంగుల కళ్లద్దాలను ఎంపిక చేసుకుని వాడుతున్నారు. అయితే కళ్లద్దాలపై దుమ్మూ, ధూళి పేరుకుంటుంది. అంతే కాకుండా గీతలు..

Eyeglasses Cleaning: కళ్లద్దాలను శుభ్రం చేయాలా.. అయితే టూత్ పేస్ట్ ని ఇలా వాడండి!
Eyeglasses Clean
Follow us on

ఇప్పుడు అందరూ ఫ్యాషన్ గా కళ్లద్దాలను వాడుతున్నారు. కొంత మంది దృష్టి లోపం కారణంగా కళ్లద్దాలను ఉపయోగిస్తున్నారు. మరికొంత మంది కాంటాక్ట్ లెన్స్ లను ఉపయోగిస్తుంటారు. కానీ కాంటాక్ట్ లెన్స్ ని ధరించడం చాలా కష్టం. కళ్లకు చికాకుగా ఉంటాయి. దీంతో చాలా మంది కళ్లద్దాలనే యూజ్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దీంతో రంగు రంగుల కళ్లద్దాలను ఎంపిక చేసుకుని వాడుతున్నారు. అయితే కళ్లద్దాలపై దుమ్మూ, ధూళి పేరుకుంటుంది. అంతే కాకుండా గీతలు కూడా పడతాయి. నార్మల్ క్లాత్ తో తుడిచినా అంత తేలిగ్గా పోవు. వీటిని క్లీన్ చేయడం చాలా కష్టం. దీంతో కొత్తవి తీసుకుంటూంటారు. అలా కాకుండా ఇంటి చిట్కాలను ఉపయోగించి కళ్లద్దాలను చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఎలానో తెలుసుకోండి.

టూత్ పేస్ట్:

సాధారణంగా కళ్లద్దాల మీద గీతలు పడుతూ ఉంటాయి. ఈ గీతలు అంత తేలిగ్గా పోవు. వీటిని తొలగించుకోవడానికి టూత్ పేస్ట్ గా హెల్ప్ చేస్తుంది. టూత్ పేస్ట్ తో దంతాలను తెల్లగా మారతాయో.. కళ్ల అద్దాలను కూడా అలాగే తెల్లగా మార్చుతుంది. ఒక మెత్తటి క్లాత్ తీసుకుని.. దానిపై కొద్దిగా పేస్ట్ వేసి.. కళ్లద్దాలపై సున్నితంగా రుద్దండి. ఆ తర్వాత మరో క్లాత్ తీసుకుని వాటర్ ముంచి కళ్లద్దాలపై క్లీన్ చేసుకుంటే సరి. ఇలా చేస్తే కళ్లద్దాలపై ఉండే దుమ్ము, ధూళి, గీతలు, మసకగా ఉండటం పోయి తెల్లగా, క్లీన్ గా కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

బేకింగ్ సోడా:

కళ్లద్దాలను తెల్లగా మార్చడంలో బేకింగ్ సోడా కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో కొద్దిగా నీరు, కొంచెం బేకింగ్ సోడా వేసి కలపండి. ఆ తర్వాత ఒక మెత్తటి క్లాత్ తీసుకని.. బేకింగ్ సోడా మిశ్రమంలో ముంచి.. కళ్లద్దాలపై సున్నితంగా తుడవాలి. ఇలా చేస్తే కళ్లద్దాలపై ఉండే దుమ్ము, ధూళి, గీతలు వంటివి పోతాయి.

అంట్ల సబ్బు:

అంట్ల సబ్బుతో కూడా కళ్ల జోడును, లెన్స్ ను కూడా క్లీన్ చేసుకోవచ్చు. దీని వల్ల ఎలాంటి నష్టాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. చేతి వేళ్లను ఉపయోగించి లెన్స్ లను డిష్ సోప్ తో శుభ్రం చేసుకోవచ్చు. డిష్ సోప్ లో చేతి వేళ్లు పెట్టి.. వాటితో నెమ్మదిగా లెన్స్ లపై రుద్దాలి. ఇలా చేయడం వల్ల అవి శుభ్ర పడతాయి. కళ్లద్దాలను క్లాత్ సహాయంతో క్లీన్ చేసుకోవాలి. అయితే ఒక విషయం ముఖ్యంగా గుర్తించుకోవాలి. సిట్రస్ తయారు చేసిన సోప్ లను వాడ కూడదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.