
Tulsi Side Effects: ఆయుర్వేదంలో ‘తులసి’ని దివ్యఔషధంగా పేర్కొనడం జరిగింది. ఇక హిందూ మత గ్రంధాలలో ఎంతో పవిత్రమైనదిగా పేర్కొన్నారు. ప్రధానంగా చూసుకుంటే.. వివిధ చర్మ రుగ్మతలు, అంటువ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి తులసిని ఉపయోగిస్తారు. అయితే తులసిని అధికంగా తీసుకోవడం వల్ల సంతానలేమికి దారితీస్తుందని తాజాగా పరిశోధనలు చెబుతున్నారు. శతాబ్దాలుగా ఆయుర్వేద, చైనీస్ ఔషధాలలో సాంప్రదాయ ఔషధంగా ఉపయోగించబడుతున్నప్పటికీ.. దీని అతి వినియోగం ఇతర సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు.
తులసి ప్రయోజనాలు..
1. జలుబు, ఫ్లూ వంటి వివిధ కాలానుగుణ వ్యాధులను నయం చేయడంలో అపారమైన ప్రయోజనాలను కలిగి ఉంది.
2. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
3. చర్మ సంబంధిత సమస్యలను నివారిస్తుంది.
4. కిడ్నీ సమస్యలను నయం చేస్తుంది.
5. పాము కాటు సమయంలో తులసిని చికిత్సలో వినియోగిస్తారు.
6. జీర్ణ సమస్యలకు చికిత్స చేస్తుంది.
7. శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేస్తుంది.
తులసి వలన కలిగే నష్టాలు..
1. గర్భధారణ సమయంలో తులసిని ఎక్కువగా తింటే ఇబ్బందులు తలెత్తుతాయి. తులసి ఆకులను ఎక్కువగా తినడం గర్భిణీ స్త్రీల ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. కొన్ని సందర్భాల్లో గర్భస్రావం కూడా దారితీస్తుంది.
2. హెర్బ్ గర్భాశయం, కటి ప్రాంతాలకు రక్త ప్రవాహాన్ని ప్రేరేపించడం ద్వారా తీవ్రమైన గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తుంది.
3. బ్లడ్ షుగర్ అసమతుల్యతకు కారణమవుతుంది
4. సంతానోత్పత్తిని ప్రభావితం చేయవచ్చు. కొన్ని అధ్యనాల్లో తులసి సంతానోత్పత్తిపై ప్రభావితం చూపుతుందని తేలింది. ఇది స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తుందని తేల్చారు.
5. దంత క్షయం సమస్య పెరుగుతుంది.
6. కాలేయ ఆరోగ్యం దెబ్బతింటుంది.
పై కథనాన్ని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ప్రజల సాధారణ ఆసక్తుల నేపథ్యంలో ఆయుర్వేద, ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇది పబ్లిష్ చేయడం జరిగింది. ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..