Youthful Skin Secrets: చర్మం యవ్వనంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే..!

మన రోజువారీ ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని ముఖ్యంగా మన చర్మాన్ని ప్రభావితం చేస్తాయి. యవ్వనంగా మెరిసే చర్మం పొందడానికి కొన్ని సహజమైన పండ్లు, కూరగాయలు చాలా ఉపయోగపడతాయి. అవి ఏంటో అవి చర్మానికి ఎలా మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Youthful Skin Secrets: చర్మం యవ్వనంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే..!
Glowing Skin

Updated on: May 30, 2025 | 6:13 PM

ఎరుపు, నారింజ, పసుపు రంగుల్లో ఉండే బెల్ పెప్పర్‌ లో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో కొల్లాజెన్ అనే ప్రోటీన్‌ ను పెంచుతుంది. కొల్లాజెన్ చర్మ కణాలు కొత్తగా ఏర్పడటానికి అవసరం. దీని వల్ల చర్మం దృఢంగా, మృదువుగా, దెబ్బతినకుండా ఉంటుంది.

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్‌బెర్రీ వంటి బెర్రీ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాలుష్యం, సూర్యరశ్మి (UV రేడియేషన్) వంటి హానికరమైన వాటి నుండి కాపాడతాయి. అంతేకాకుండా చర్మానికి ఇన్ఫెక్షన్లు రాకుండా రక్షణను పెంచుతాయి.

నారింజలో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది చర్మానికి సహజమైన కాంతిని ఇస్తుంది. ప్రతిరోజూ తాజా నారింజ తినడం వల్ల చర్మం మెరుస్తుంది. ఇది వయస్సును తగ్గించినట్లు కనిపించేలా చేస్తుంది. ముఖ్యంగా వయసుతో వచ్చే ముడతలు, పొడి చర్మం తగ్గుతాయి.

చిలగడదుంపతో చర్మం ఆరోగ్యంగా మారుతుంది. ఈ కూరగాయలో విటమిన్ A, కెరోటినాయిడ్లు వంటి పోషకాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా ఉంచడమే కాకుండా కొత్త చర్మ కణాలు ఏర్పడటానికి సహాయపడతాయి. అలాగే వాతావరణ మార్పుల వల్ల వచ్చే పొడిదనాన్ని కూడా తగ్గిస్తాయి.

బాదం, వాల్‌ నట్స్, ఫ్లాక్స్‌ సీడ్స్, చియా సీడ్స్ వంటి నట్స్, విత్తనాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ E, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని బలంగా ఉంచి, అలర్జీలు, మొటిమలు, ఎరుపుదనం వంటి సమస్యలు రాకుండా చూస్తాయి.

టమాటాలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది చర్మానికి నెమ్మదిగా వృద్ధాప్య లక్షణాలు రాకుండా కాపాడుతుంది. రోజూ ఒకటి రెండు టమాటాలు తినడం లేదా రసంగా తీసుకోవడం వల్ల చర్మం సహజంగా మెరిసిపోతుంది. ఇది శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపడానికి కూడా సహాయపడుతుంది.

ఉసిరికాయను సహజ విటమిన్ C నిల్వ అనవచ్చు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్యపాత్ర పోషించడంతో పాటు చర్మాన్ని తాజాగా, యవ్వనంగా ఉంచుతుంది. ఉసిరి తినడం వల్ల చర్మం సహజంగా మెరుస్తుంది. ఇది ముడతలు రాకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఈ ఆహార పదార్థాలన్నీ సహజసిద్ధంగా లభిస్తాయి. వీటిని ప్రతిరోజూ లేదా వారానికి 3 నుంచి 4 సార్లు మీ ఆహారంలో చేర్చుకుంటే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)