ఆరెంజ్ కన్నా బెస్ట్.. విటమిన్ C పవర్ హౌస్ కూరగాయలు, పండ్లు ఇవే..!

విటమిన్ C మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. చాలా మంది నారింజలో విటమిన్ C ఎక్కువ ఉంటుందని అనుకుంటారు. అయితే కొన్ని కూరగాయలు, పండ్లలో నారింజ కన్నా ఎక్కువ విటమిన్ C ఉంటుంది. అవేంటో వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఆరెంజ్ కన్నా బెస్ట్.. విటమిన్ C పవర్ హౌస్ కూరగాయలు, పండ్లు ఇవే..!
Vitamin C Rich Foods

Updated on: Jul 29, 2025 | 7:25 PM

100 గ్రాముల నారింజలో ఎంత విటమిన్ C ఉంటుంది..? ఒక నారింజలో సుమారు 53.2 మిల్లీగ్రాముల విటమిన్ C ఉంటుంది. ఇది రోజువారీ అవసరాలకు సరిపోతుంది. కానీ నారింజ కన్నా ఎక్కువ విటమిన్ C ఉన్న కొన్ని కూరగాయలు, పండ్లు మన చుట్టూనే ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరెంజ్ కంటే ఎక్కువ విటమిన్ C ఉన్న కూరగాయలు

  • క్యాప్సికమ్.. ఈ కూరగాయలో 100 గ్రాములకు దాదాపు 190 మిల్లీగ్రాముల విటమిన్ C దొరుకుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి మంచిది. రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా సహాయపడుతుంది. అలాగే శరీరంలోని వాపులను తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.
  • బ్రోకలీ.. బ్రోకలీ కూడా విటమిన్ C ఎక్కువగా ఉన్న కూరగాయల్లో ఒకటి. 100 గ్రాముల బ్రోకలీలో సుమారు 89 మిల్లీగ్రాముల విటమిన్ C ఉంటుంది. ఇందులో ఫైబర్, విటమిన్ K, ఫోలేట్ లాంటి మరిన్ని పోషకాలు కూడా ఉంటాయి. ఇవన్నీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో, ఎముకల ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి.
  • మస్టర్డ్ గ్రీన్స్.. ఆవాల ఆకులు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ప్రతి 100 గ్రాములకు సుమారు 130 మిల్లీగ్రాముల విటమిన్ C ఉంటుంది. ఇది కాకుండా విటమిన్ A, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు లాంటి పోషకాలు కూడా ఈ ఆకుల్లో ఎక్కువగా ఉంటాయి.

ఆరెంజ్ కంటే ఎక్కువ విటమిన్ C ఉన్న పండ్లు

  • ఉసిరికాయ
  • జామకాయ
  • బొప్పాయి
  • లీచీ
  • స్ట్రాబెర్రీలు
  • కివీ
  • పైనాపిల్
  • పై పండ్లను తరచుగా మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తికి బలం చేకూరుతుంది.

విటమిన్ C ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే. కానీ ఏదైనా ఆహారపు అలవాట్లను మార్చుకునే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)