నో టెన్షన్.. ఈ రసం ఓ గ్లాసు తాగితే కొవ్వును పిండి బయటకు తీసినట్లే.. మీరూ ట్రైచేయండి..

|

Jun 10, 2024 | 11:39 AM

కొలెస్ట్రాల్ పెరగడం శరీరానికి పెను ప్రమాదం.. ఇది రక్త సిరల్లో ఫలకం పేరుకుపోవడానికి కారణమవుతుంది.. ఇది సరఫరాకు అడ్డంకిని కలిగిస్తుంది. కొలెస్ట్రాల్.. అధిక రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్‌లకు మరింత కారణమవుతుంది. వాస్తవానికి కొలెస్ట్రాల్ అనేది రక్త నాళాలలో ఉండే ఒక రకమైన కొవ్వు.. ఇది కణాలు, హార్మోన్లను తయారు చేయడానికి శరీరం ఉపయోగిస్తుంది.

నో టెన్షన్.. ఈ రసం ఓ గ్లాసు తాగితే కొవ్వును పిండి బయటకు తీసినట్లే.. మీరూ ట్రైచేయండి..
Cholesterol
Follow us on

కొలెస్ట్రాల్ పెరగడం శరీరానికి పెను ప్రమాదం.. ఇది రక్త సిరల్లో ఫలకం పేరుకుపోవడానికి కారణమవుతుంది.. ఇది సరఫరాకు అడ్డంకిని కలిగిస్తుంది. కొలెస్ట్రాల్.. అధిక రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్‌లకు మరింత కారణమవుతుంది. వాస్తవానికి కొలెస్ట్రాల్ అనేది రక్త నాళాలలో ఉండే ఒక రకమైన కొవ్వు.. ఇది కణాలు, హార్మోన్లను తయారు చేయడానికి శరీరం ఉపయోగిస్తుంది. శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ రెండు రకాలుగా విభజిస్తారు.. HDL (మంచి), LDL (చెడు) గా పేర్కొంటారు.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీని కారణంగా, గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక పరిస్థితులను ఎదుర్కొనే సమస్య చాలా రెట్లు పెరుగుతుంది.

కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి?

క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం.. పెద్దవారిలో LDL అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయి 100 mg/dL కంటే తక్కువగా ఉండాలి. మంచి కొలెస్ట్రాల్ HDL స్థాయి 60 mg/dL కంటే ఎక్కువగా ఉండాలి.

చెడు కొలెస్ట్రాల్‌ పెరిగితే కనిపించే సంకేతాలు

  • తీవ్రమైన శ్వాస తీసుకోవడం..
  • ఛాతీలో నొప్పి
  • అలసట, నీరసం..
  • గుండె కొట్టుకోవడం పెరగడం లేదా తగ్గడం..
  • శరీర బలహీనత..
  • కంటి పైన పసుపు రంగు కనిపించి కింది భాగంలో ఉబ్బడం..

చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టాలనుకున్న వారికి దివ్యౌషధం టమాట రసం..

టొమాటో రసం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉండే లైకోపీన్ అనే సమ్మేళనం లిపిడ్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. దీనితో పాటు, టమోటా రసంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఫైబర్, నియాసిన్ కూడా పుష్కలంగా ఉన్నాయి. అయితే.. దీనిని ఉదయాన్నే పరగడుపున ఓ గ్లాసు తాగితే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఒక సంవత్సరంలో టమోటా రసంతో కొలెస్ట్రాల్ సాధారణమైంది

2019 అధ్యయనం ప్రకారం.. ఉప్పు లేని టమోటా రసం తాగడం వల్ల జపాన్‌లోని 260 మంది పెద్దలలో ఒక సంవత్సరంలో LDL కొలెస్ట్రాల్ మెరుగుపడింది. కావున కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు టమాట రసం తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఈ పానీయం గుండెను మూసుకుపోయే విధంగా చేసే చెడు కొలెస్ట్రాల్‌కు దివ్యౌషధం.. దీన్ని తాగడం వల్ల ధమనులలోని చెడు కొవ్వు తొలగిపోతుందంటున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్చేయండి..