Health Tips: ఒమిక్రాన్‌ నుంచి రక్షించుకునేందుకు ఈ నాలుగు అలవాట్లను మీ దినచర్యలో భాగం చేసుకోండి

|

Feb 26, 2022 | 9:22 PM

Health Tips: కరోనా (Corona) కారణంగా నేడు ప్రపంచం మొత్తం భయానక వాతావరణం నెలకొంది. ఈ వైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ (Omicron) కూడా ప్రజలలో భయాందోళనలను..

Health Tips: ఒమిక్రాన్‌ నుంచి రక్షించుకునేందుకు ఈ నాలుగు అలవాట్లను మీ దినచర్యలో భాగం చేసుకోండి
Follow us on

Health Tips: కరోనా (Corona) కారణంగా నేడు ప్రపంచం మొత్తం భయానక వాతావరణం నెలకొంది. ఈ వైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ (Omicron) కూడా ప్రజలలో భయాందోళనలను వ్యాప్తి చేసింది. ఈ కరోనా వైరస్ (Coronavirus) బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు రకరకాల పద్ధతులను అవలంబిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కరోనా దాని వేరియంట్ ఓమిక్రాన్ బలహీనమైన రోగనిరోధక (Immunity)శక్తి ఉన్నవారిని మరింతగా బలహీనంగా మారుస్తోంది. మీరు వైరస్‌ నుంచి రక్షించుకుంటూ ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారంతో పాటు, మంచి దినచర్యను అనుసరించడం కూడా చాలా ముఖ్యం.

వ్యాయామం చేయడానికి త్వరగా లేవండి:

మీరు ప్రతిరోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకుంటే అది ఓమిక్రాన్ నుండి రక్షించడమే కాకుండా శరీరంలోని అనేక సమస్యలను కూడా తొలగిస్తుంది. వ్యాయామం చేసేటప్పుడు శ్వాస వ్యాయామాలు చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఆక్సిజన్ స్థాయి కూడా మెరుగుపడుతుంది. అంతే కాదు వ్యాయామం చేయడం వల్ల రోజంతా శరీరంలో శక్తి ఉండి హుషారుగా ఉంటారు. వ్యాయామం ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

ఆహారం పట్ల శ్రద్ధ వహించండి:

జంక్ ఫుడ్ అనేది ప్రజల దినచర్యలో భాగంగా మారింది. అయితే మన రోగనిరోధక శక్తిని బలహీనపరచడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మీరు జంక్ ఫుడ్‌ను ఎక్కువగా ఇష్టపడితే, వారానికి ఒక రోజును ఎంపిక చేసుకోండి. విటమిన్లు, ఖనిజాలు మరియు ఇతర పోషకాలతో కూడిన ఆకుపచ్చ కూరగాయలను ప్రతిరోజూ తినండి.

తులసి ఆకులను తినండి:

ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న తులసితో ఎన్నో ఉపయోగాలున్నాయి. తులసి వ్యాధుల నుండి మనల్ని దూరం చేస్తుంది. ఇది మన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. రోజూ ఖాళీ కడుపుతో 3 నుంచి 4 తులసి ఆకులను నమలడం అలవాటు చేసుకోండి.

పసుపు పాలు:

యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలతో కూడిన పసుపును తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. కోవిడ్ నుండి రక్షించడంలో పసుపు చాలా ప్రభావవంతంగా ఉందని అధ్యయనాల ద్వారా నిరూపించబడింది. కోవిడ్ సమయంలో రక్షించుకునేందుకు ప్రజలు పసుపు నీరు, పసుపు పాలు, ఇతర పద్ధతులతో దీనిని వినియోగించారు. అలాగే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పసుపు పాలు తాగితే సరైన నిద్ర ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఇవి కూడా చదవండి:

Health Tips: ఊబకాయాన్ని అదుపులో ఉంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఆహారంలో ఈ మార్పులు చేసుకోవల్సిందే..

Oats Recipe: సులువుగా బరువుతగ్గాలనుకుంటున్నారా? ఐతే ఈ వంటకాలు ప్రయత్నించండి..