
కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్ గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. వైద్యుల నిపుణుల సూచన ప్రకారం కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుందట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొంతమందిలో ఇది జన్యుపరమైన సమస్యగా ఉంటుంది. దీని వల్ల చిన్న వయస్సులోనే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులలో ఎవరికైనా FH ఉంటే 50 శాతం అవకాశం పిల్లలకు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.
వారానికి కనీసం 150 నిమిషాల వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ చేయాలి. ధూమపానం పూర్తిగా మానేయాలి. ఎందుకంటే ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది
అధిక బరువు సమస్యను నియంత్రించుకోవాలి, ఎందుకంటే అది కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచుతుంది.
కుటుంబంలో అనారోగ్య చరిత్ర ఉంటే, కేవలం జీవన విధానం మార్పులతోనే కొలెస్ట్రాల్ నియంత్రించలేరు. ఖచ్చితంగా మందులు ఉపయోగించాలి, వీటివల్ల లివర్ లో చెడు కొవ్వు ఉత్పత్తి తగ్గిపోతుంది. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, జన్యు పరీక్షల ద్వారా ఈ సమస్యను ముందుగా గుర్తించుకోవచ్చు
కొలెస్ట్రాల్ పెరగడం గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, మందులు ద్వారా కొలెస్ట్రాల్ నియంత్రించుకోవచ్చు. ఏమైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.