చాలా మందికి వయస్సుతో సంబంధం లేకుండా తెల్లజుట్టు(White Hair) వస్తుంది. దానికి ఆహారపు అలవాట్లు, ప్రస్తుత వాతావరణమే కారణమని నిపుణులు చెబుతున్నారు. తెల్లజుట్టుతో పాటు జట్టు రాలడం(Hair Fall) కూడా ప్రధాన సమస్యగా మారింది. వీటిని నివారించడానికి ఎన్ని ప్రయత్నాలు సఫలం కావడం లేదు. అయితే ఈ సమస్యలు తగ్గాలంటే ఈ చిట్కాను అమలు చేయండి. దీని వల్ల జుట్టు రాలే సమస్య తగ్గడం సహా తెల్ల జుట్టు కూడా రాకుండా ఉంటుంది. ఉల్లిపాయ(Onion) రసాన్ని తలకు పట్టించడడం వల్ల వెంట్రుకలు శుభ్రంగా మారడం సహా రక్త ప్రసరణ మెరుగవుతుంది. జుట్టు కుదుళ్లలో శుభ్రంగా ఉండడం మూలంగా జుట్టు రాలే సమస్య తగ్గిపోయే అవకాశం ఉంది. ఉల్లి రసాన్ని వినియోగించడం వల్ల జుట్టు కుదుళ్లలో దుమ్ము, ఫంగల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ చేరవట.
వెంట్రుకలు బాగా పెరగాలన్నా, మందంగా ఉండాలన్నా ఉల్లిపాయ రసం ఎంతో మేలు చేస్తుందట. ఉల్లి రసాన్ని జుట్టుకు పట్టించడం లేదా కొబ్బరినూనెతో కలిపి దీన్ని మసాజ్ చేయవచ్చు. వారం రోజుల తర్వాత మీకే వ్యత్యాసం కనిపిస్తుంది. ఉల్లి రసం ఇలా తయారు చేసుకోండి. ముందుగా కొన్ని ఉల్లిపాయలను తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని మిక్సర్ గ్రైండర్ మిక్సి పట్టాలి. ఆ రసాన్ని నిమ్మరసంతో కలిపాలి. దీని తర్వాత విటమిన్ -ఈ క్యాప్సూల్స్‌లోని నూనెను అందులో జోడించాలి. ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. కొద్దిసేపటి తర్వాత చల్లని నీటితో తలస్నానం చేయాలి. స్నానం చేసిన వెంటనే తల తుడుచుకోకుండా కాస్త ఆరిన తర్వాత జుట్టును తుడుచుకోవాలి.
Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.
Read Also.. Weight Loss Tips: ఊబకాయంతో బాధపడుతున్నారా..? ఈ కూరగాయలను తింటే బరువు తగ్గొచ్చు..