Weight Loss Tips Telugu: ఉరుకులు పరుగుల జీవితంలో బరువు పెరగడం అనేది ఒక సాధారణ సమస్య మారింది. ఊబకాయం వల్ల సమయానికి ముందే అనేక రకాల వ్యాధులు (Health) చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో చాలామంది బరువు తగ్గడానికి పలు పద్ధతులను అనుసరిస్తారు. కానీ మీరు నిజంగా మీ బరువును నియంత్రించాలనుకుంటే.. మొదట మీ ఆహారాన్ని నియంత్రించడం నేర్చుకోవాలంటున్నారు నిపుణులు. కొవ్వు పేరుకుపోవడానికి మన తప్పుడు ఆహారమే ప్రధాన కారణం. దీని కోసం బయటి జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, జిడ్డు పదార్థాలు తినడం తగ్గించండి. మీ ఆహారంలో తక్కువ కేలరీల ఆహారాన్ని చేర్చండి. మీ తక్కువ వ్యవధిలో వేగంగా బరువును తగ్గించుకోవాలనుకుంటే.. మంచి డైట్ అనుసరించాలని సూచిస్తున్నారు. బరువు తగ్గేందుకు సహాయకరంగా భావించే ఆహారపదార్థాలు (diet plan) ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పీనట్ బటర్
మీరు వెన్న తినడానికి ఇష్టపడతారు. కానీ స్థూలకాయం పెరుగుతుందనే భయంతో ఆహారాన్ని నియంత్రించుకుంటుంటారు. అయితే.. ఇలాంటి పరిస్థితి వస్తే మీరు ఆహారంలో వేరుశెనగ వెన్నను చేర్చుకోండి. పీనట్ బటర్ కూడా తినడానికి చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా కేలరీలు తక్కువగా ఉంటాయి. మీరు ఉదయం అల్పాహారం కోసం వోట్మీల్ లేదా బ్రౌన్ బ్రెడ్‌తో దీనిని తినవచ్చు. ఇది బరువును కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది.
గుడ్లు
కోడిగుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చాలాసేపటి వరకు కడుపు నిండుగా ఉంచుతాయి. ఇవి తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. అటువంటి పరిస్థితిలో.. మీరు ఉదయం వేళ గుడ్లను అల్పాహారంగా తీసుకోవచ్చు. గుడ్డు మీ శరీరానికి కూడా మేలు చేస్తుంది. అతిగా తినడం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. ఇలా చేస్తే మీ బరువు అదుపులో ఉండటంతోపాటు తగ్గుతుంది.
ఓట్‌మీల్
ఓట్‌మీల్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పిండి పదార్ధాలకు మంచి మూలం కూడా… అయితే.. ఇది మీ బరువును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. అల్పాహారంలో ఓట్ మీల్ తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు. అంతేకాకుండా శరీరంలో శక్తి చాలా కాలం పాటు ఉంటుంది. అధిక బరువుతో బాధపడేవారు మీ ఆహారంలో వోట్మీల్ ను చేర్చుకోవడం ఉత్తమం.
గింజలు.. తృణధాన్యాలు..
చియా, అవిసె, గుమ్మడి గింజలు మొదలైనవి కూడా బరువును అదుపులో ఉంచుతాయి. ఇవి మీ శరీర బలహీనతను తొలగించి.. శక్తిని పెంపొదిస్తాయి.
ఇవి కూడా..
మీ ఆహారంలో గోధుమలు, సోయా, బజ్రా, జోవర్, రాగి, బ్రౌన్ రైస్‌ని చేర్చుకోండి.. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, అలాగే ఇవి చాలా పోషకమైనవి. వీటిని తినడం వల్ల పొట్ట చాలా కాలం పాటు నిండుగా ఉండి.. ఊబకాయం, అధికబరువు తగ్గుతుంది.
Also Read: