మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నిత్యం పండ్లు, కూరగాయలను తీసుకోవాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకు వాటిల్లోని పోషకాలే ప్రధాన కారణమని మనలో చాలా మందికి తెలుసు. పండ్లలోని పోషకాలు మన శరీరానికి అందడం వల్ల మనకు ఎన్నో రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. అయితే ఈ పండ్లలోని పోషకాలు కొన్ని రకాల సమస్యలు ఉన్నవారిపై ప్రతికూల ఫలితాలను చూపిస్తాయి. అలాంటి పోషకాలను కలిగిన పండ్లలో పియర్స్ కూడా ఒకటి. చూడటానికి జామ కాయలా కనిపంచే ఈ పండును తెలుగులో బేరి ప్రూట్ అంటారు. తినడానికి ఎంతో రుచికరంగా ఉండే ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ పండులో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉన్నాయి. అయితే ముందుగా పేర్కొన్నట్లుగా ఈ ప్రూట్ తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. అవేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..