Hyperthermia: మీలో ఈ లక్షణాలున్నాయా.? ‘హైపర్‌ థెర్మియా’తో బాధపడుతున్నట్లే..

శరీరం సాధరణ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉండడాన్ని హైపర్‌థెర్మియా అని పిలుస్తుంటారు. వాతావరణంలో మార్పు, ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు, ఎక్కువగా అలసిపోడం, చెమట పట్టకపోవడం వంటి కారణాల వల్ల హైపర్‌ థెర్మియా సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సరిగా చెమట పట్టకపోతే.. శరీరం వేడెక్కడం ప్రారంభమవుతుంది. దీంతో హైపర్‌ థెర్మియా సమస్య వస్తుంది...

Hyperthermia: మీలో ఈ లక్షణాలున్నాయా.? హైపర్‌ థెర్మియాతో బాధపడుతున్నట్లే..
Hyperthermia'

Updated on: Dec 08, 2023 | 5:42 PM

కొన్ని సందర్భాల్లో శరీరం ఒక్కసారి వేడెక్కుతోంది. సాధారణ టెంపరేచర్‌తో పోల్చితే వేడి పెరుగుతుంది. అయితే జ్వరం వచ్చిన సమయంలో అయితే సహజంగా జ్వరం వచ్చిన సందర్భాల్లో శరీర ఉష్ణోగ్రత పెరగడం సహజమే అయినా.. ఎలాంటి కారణంగా లేకుండా నిత్యం వేడిగా ఉంటే మాత్రం ఆలోచించాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.

శరీరం సాధరణ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉండడాన్ని హైపర్‌థెర్మియా అని పిలుస్తుంటారు. వాతావరణంలో మార్పు, ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు, ఎక్కువగా అలసిపోడం, చెమట పట్టకపోవడం వంటి కారణాల వల్ల హైపర్‌ థెర్మియా సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సరిగా చెమట పట్టకపోతే.. శరీరం వేడెక్కడం ప్రారంభమవుతుంది. దీంతో హైపర్‌ థెర్మియా సమస్య వస్తుంది. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు సకాలంలో చికిత్స అందించకపోతే.. తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి..? ఎలాంటి చిట్కాలు తీసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* హైపర్‌ థెర్మియా సమస్యతో బాధపడుతున్న వారు రోజుకు కనీసం ఎమినిది గ్లాసుల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలి. నిత్యం మంచి నీళ్లు, మజ్జిగా వంటివి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

* ఇక ధరించే దుస్తుల విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటే హైపర్‌ థెర్మియాను నివారించవచ్చు. ముఖ్యంగా లేత రంగులు, వదులుగా ఉండే దుస్తులను ధరించవచ్చు. ఇలాంటి దుస్తులను ధరించడం వల్ల శరీరానికి గాలి తగులుతుంది.

* ఈ సమస్యతో బాధపడే వారు ఎక్కువ సమయం సూర్యకాంతికి ఎక్స్‌పోజ్‌ కాకూడదు. దీనివల్ల శరీరం ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నీడలో ఉండే ప్రయత్నం చేయాలి.

* బీపీ, హృదయ సంబంధిత వ్యాధులకు సంబంధించిన మందులను ఉపయోగించే వారిలో కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

* ఇక హైపర్‌ థెర్మియాను ముందుగానే మీ శరీరంలో జరిగే మార్పుల ఆధారంగా గుర్తించవచ్చు. ముఖ్యంగా తల తిరగడం, కండరాలు తిమ్మిరిగా ఉండడం కనిపిస్తే మీ శరీరం వేడెక్కడానికి సంకేతంగా భావించాలి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే.. విశ్రాంతి తీసుకోవాలి, నీరు తాగాలి. ఇంకా తగ్గకపోతే వైద్యులను సంప్రందించాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్య నిపుణులను పాటించడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..