Blood Sugar Levels: రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించే ఆహారాలు ఇవే..!

| Edited By: Anil kumar poka

Apr 24, 2022 | 8:54 AM

Blood Sugar Levels: భారతదేశంలో మధుమేహ వ్యాధిగ్రస్థులు ఎక్కువగా ఉంటారు. ఇది అనేక ఇతర వ్యాధులకు కారణమవుతుంది. గుండె,

Blood Sugar Levels: రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించే ఆహారాలు ఇవే..!
Blood Sugar Levels
Follow us on

Blood Sugar Levels: భారతదేశంలో మధుమేహ వ్యాధిగ్రస్థులు ఎక్కువగా ఉంటారు. ఇది అనేక ఇతర వ్యాధులకు కారణమవుతుంది. గుండె, మూత్రపిండాలు, మెదడు, చర్మంపై లోతైన ప్రభావం ఉంటుంది. ఇలా జరగకూడదంటే మధుమేహ రోగులు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవాలి. సాధారణంగా హార్మోన్లలో మార్పు కారణంగా చక్కెర స్థాయి పెరుగుతుంది. శరీరంలో చక్కెర స్ధాయి ఒక సాధారణ పరిమాణంలో మాత్రమే ఉండాలి. అయితే కొంత మందిలో ఎక్కవగా మరికొందరిలో తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర మోతాదులు అధికంగా ఉంటే డయాబెటిస్ బారిన పడతారు. అందుకే రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించే ఆహారాలు తీసుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.

తృణధాన్యాలు: ఇవి విటమిన్లు ,ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్ మూలాన్ని కలిగి ఉంటాయి. జీర్ణక్రియలోను ఎంతో సహాయపడతాయి. బ్లాక్ వీట్, బార్లీ, ఓట్స్, క్వినోవా, రాగి వంటి తృణధాన్యాలను తీసుకోవటం మంచిది. వీటివల్ల మధుమేహాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు.

గ్రీన్ వెజిటేబుల్స్: వీటిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి . ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బచ్చలికూర, పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో కార్బోహైడ్రేట్లు, కేలరీలు తక్కువగా మోతాదులో ఉంటాయి. వీటిని సలాడ్‌లు, సూప్‌లుగా తీసుకుంటే మంచిది.

చేపలు, చికెన్, గుడ్లు: చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. వీటిని తినడం వల్ల కడుపునిండినట్లుగా ఉంటుంది. అందుకే మళ్లీ మళ్లీ ఆహారం తినాలనిపించదు. దీంతో బరువు కూడా సులువుగా తగ్గుతారు.

పెరుగు, చీజ్: ఇవి ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి మంచి మూలం. కొవ్వు, పిండి పదార్థాలు తక్కువగా ఉండే పాల ఉత్పత్తులను ఆహారంగా ఎంచుకోవాలి. పుదీనా మజ్జిగ , తక్కువ కొవ్వు తో కూడిన పెరుగు తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

RCB vs SRH: 68 పరుగులకే కుప్పకూలిన బెంగుళూరు.. సునాయసనంగా గెలిచిన హైదరాబాద్..

NEP 2020: ఆ రాష్ట్రంలో ఇక ఎంఫిల్‌ చదువులకి స్వస్తి.. బీఈడీ కోర్సు నాలుగు సంవత్సరాలు..!

CRIS Recruitment 2022: నిరుద్యోగులకి శుభవార్త.. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ నుంచి నోటిఫికేషన్..