Health: ఈ సింటమ్స్ కనిపిస్తున్నాయా? అయితే ఆ లోపమే

మెగ్నీషియం నాడీ వ్యవస్థను అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా మానసిక స్థితిని కంట్రోల్‌లో ఉంచే న్యూరోట్రాన్స్మీటర్ల ఉత్పత్తిలో కూడా మెగ్నీషియం పాల్గొంటుంది. అయితే ఇంతటీ ముఖ్యమైన మెగ్నీషియం శరీరంలో లోపిస్తే ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. బీపీని కంట్రోల్ చేయడంలో...

Health: ఈ సింటమ్స్ కనిపిస్తున్నాయా? అయితే ఆ లోపమే
Magnesium Deficiency

Updated on: Feb 24, 2024 | 5:35 PM

మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా శరీరానికి అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు సరైన మోతాదులో అందాలి. ఇలాంటి ముఖ్యమైన వాటిలో మెగ్నీషియం ఒకటి. మానవ శరీరానికి కావాల్సిన అత్యంత ముఖ్యమైన ఖనిజాల్లో మెగ్నీ షియంఒకటి. కండరాలు సరిగ్గా పనిచేయాలన్నా… శరీరంలో జీవరసాయన ప్రక్రియలు సరిగ్గా ఉండాలన్నా మెగ్నీషియం ఉండాల్సిందే.

మెగ్నీషియం నాడీ వ్యవస్థను అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా మానసిక స్థితిని కంట్రోల్‌లో ఉంచే న్యూరోట్రాన్స్మీటర్ల ఉత్పత్తిలో కూడా మెగ్నీషియం పాల్గొంటుంది. అయితే ఇంతటీ ముఖ్యమైన మెగ్నీషియం శరీరంలో లోపిస్తే ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. బీపీని కంట్రోల్ చేయడంలో కూడా మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మెగ్నీషియం లోపిస్తే శరీరంలో రక్తపోటు పెరుగుతుంది. మరి శరీరంలో మెగ్నీషియం లోపిస్తే ముందుగానే కొన్ని లక్షణాల ద్వారా ముందుగానే గుర్తించవచ్చు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటంటే..

* శరీరంలో పొటాసియం స్థాయిలు గణనీయంగా తగ్గితే.. హృదయ స్పందన రేటుపై ప్రభావం పడుతుంది. దీంతో మీ గుండె కొట్టునే రేటు సాధారణం కంటే వేగంగా కొట్టుకుంటున్నట్లు అనిపిస్తే శరీరంలో మెగ్నీషియం లోపానికి సంకేతమని నిపుణులు చెబుతున్నారు. హృదయ స్పందన రేటులో తేడా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

* తరచుగా తలనొప్పి సమస్య వేధిస్తుంటే లేదా మైకం వంటి సమస్యలు వస్తే అది మెగ్నీషియం లోపంగా గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన ఆందోళన వంటి సమస్య ఎదుర్కొంటే సంబంధిత పరీక్షలు చేసుకోవాలని సూచిస్తున్నారు.

* శరీరంలో మెగ్నీషియం లోపం ఉంటే కొన్ని రకాల కంటి సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంటికి సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

* రక్తంలో మెగ్నీషియం లోపిస్తే.. నీరసం, బాగా అలసిపోయినట్లు, నిస్సత్తువ ఆవరిస్తుంది. మెగ్నీషియం శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దీంతో రాత్రుళ్లు నిద్రలేకపోవడం, లేదా విపరీతంగా నిద్రపోవడం వంటి సమస్యలు వస్తాయి.

* ఇక శరీరంలో తగితనం మెగ్నీషియం లేకపోతే ఆకలి లేకపోవడం వంటి సమస్య తలెత్తుతోందని నిపుణులు చెబుతున్నారు. మెగ్నీషియం గ్లూకోజ్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఈ ఖనిజం కొరత వల్ల ఆకలి వేయదు.

* కండరాల తిమ్మిరి వంటి సమస్య ఉన్నా శరీరంలో మెగ్నీషియం లోపించినట్లేనని అర్థం చేసుకోవాలి. కండరాలు బలంగా ఉండాలంటే మెగ్నీషియం అవసరం. మెగ్నీషియం లోపం వల్ల కండరాల తిమ్మిరి, కండరాల నొప్పులకు దారితీస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..