మారుతోన్న జీవన విధానం, ఆహారంలో మార్పుల కారణంగా అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కంప్యూటర్ల ముందు గంటలతరబడి కూర్చొని చేసే పనుల కారణంగా మెడ, నడుపు వంటి సమస్యలతో పాటు కంటి సంబంధిత సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయి. అంతేకాకుండా స్మార్ట్ ఫోన్‌ల ఉపయోగం పెరగడంతో కంటి సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే కంటి సంబంధిత సమస్యలు వచ్చే ముందు కొన్ని లక్షణాలు మనల్ని అలర్ట్ చేస్తుంటాయి. వీటిని ముందుగానే గుర్తించి వెంటనే అలర్ట్ అయితే సమస్యకు ప్రారంభంలోనే చెక్ పెట్టొచ్చు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటంటే..
* కొన్ని సందర్భాల్లో కళ్లల్లో ఆకస్మికంగా నొప్పి వస్తుంది. కంటిలో ఇలాంటి నొప్పి రాగానే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఏవైనా గాయాలు అయినా కంటిలో నొప్పి వస్తుంది.
* కొన్ని సందర్భాల్లో కళ్ల ముందు లైట్ ఫ్లాష్‌లు కనిపిస్తుంటాయి. ఇలాంటివి కనిపించగానే కంటి వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. రెటీనాలో సమస్యలకు దీనిని సూచికగా భావించవచ్చు. దీనివల్ల కాలక్రమేణ కంటి చూపు తగ్గుతుంది. ప్రారంభ దశలో రోగనిర్ధారణ చేస్తే నివారించవచ్చు.
* ఉన్నపలంగా లైట్‌ను చూస్తే కళ్లు మబ్బుగా కనిపిస్తుంటాయి. ఇది కంటి శుక్లం సమస్యకు సంకేతంగా భావించాలి. ఇలాంటి లక్షణం కనిపిస్తే దృష్టిలో స్పష్టత తగ్గడం, రాత్రి కంటచూపు మందగించడం, రెండు రెండుగా కినపించడం వంటి సమస్యలకు దారి తీస్తుండొచ్చు.
* కంటి రెప్పల్లో దురద వంటి లక్షణం కనిపిస్తే కళ్ల చుట్టూ సమస్య ఉందడానికి సంకేతంగా భావించొచ్చు. దీనిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. కళ్లు మంటగా అనిపించినా, కంటి నుంచి ఏకధాటిగా నీరు కారుతున్నా ఏమాత్రం అలక్ష్యం చేయకూడదు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..