వేసవిలో పుచ్చకాయను తినడం వలన శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. అంతేకాకుండా.. శరీరాన్ని అలసిపోకుండా ఉండడమే కాకుండా.. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అలసట, నీరసం, డీహైడ్రేషన్ సమస్యలే కాకుండా.. ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించడంలోనూ సహయపడుతుంది. (watermelon seeds) అయితే కేవలం పుచ్చకాయ మాత్రమే కాదు.. అందులోని గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయాల ప్రకారం.. పుచ్చకాయ గింజలలో అనేక రకాల పోషకాలున్నాయి. వీటిని తినడం వలన ఆరోగ్యానికి ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి. మరి పుచ్చకాయ గింజలు ఎప్పుడు.. ఎలా తీసుకోవాలో తెలుసుకుందామా.
పుచ్చకాయ గింజలలో పోషక విలువలు..
పుచ్చకాయ గింజలలో ఐరన్, మెగ్నీషియం, జింక్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. 4 గ్రాముల విత్తనాలలో దాదాపు 0.29 మి.గ్రా ఏరియన్, 21 మి.గ్రా మెగ్నీషియం, పాలీఅన్‌శాచురేటెడ్, మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఈ పోషకాల వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు అనేకం.
ఉబకాయం తగ్గిస్తుంది..
పుచ్చకాయ గింజల్లోని పోషక విలువలు దీనిని అద్భుతమైన సూపర్‌ఫుడ్‌గా చేస్తాయి. వాటిలో చాలా తక్కువ కేలరీలు కనిపిస్తాయి. ఒక సర్వింగ్‌లో కేవలం 4 గ్రాముల (కొన్ని విత్తనాలు) మాత్రమే తినాలి. తక్కువ కేలరీల ఆహారం కావడంతో బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచిది. ఊబకాయాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా అనేక సమస్యలు తగ్గుతాయి.
రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ..
పుచ్చకాయ గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం, ఇన్సులిన్ నిరోధకతతో సంబంధం కలిగి ఉంటాయి. పుచ్చకాయ గింజల్లో ఉండే మెగ్నీషియం ఇందుకు కారణమని ఓ అధ్యయనంలో తేలింది. ఇది జీవక్రియ పిండి పదార్థాలను సమర్ధవంతంగా నియంత్రించడం ద్వారా టైప్-2 డయాబెటిస్‌లో సహాయపడుతుంది.
మెరిసే చర్మం..
పుచ్చకాయ గింజలు చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది స్కిన్ టోన్‌ని మెరుగుపరచడమే కాకుండా వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది. పుచ్చకాయ గింజల నుండి తీసిన నూనెను అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తారు.
పుచ్చకాయ గింజలను తినడానికి సరైన మార్గం..
పుచ్చకాయ గింజలను తీసివేసిన తర్వాత, వాటిని పాన్‌లో బాగా కాల్చాలి. ఆ తర్వాత ఈ విత్తనాలను బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవాలి. వాటిని సలాడ్లు, ఓట్స్, టోస్ట్ లేదా ఏదైనా ఇతర విత్తనాలు, గింజలతో కలిపి కూడా తినవచ్చు.
గమనిక:- ఈ కథనం కేవలం ఆరోగ్య నిపుణుల అభిప్రాయాలు..సూచనల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని టీవీ9 తెలుగు దృవీకరించలేదు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: Actor Vijay Babu: అమ్మ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తప్పుకున్న హీరో.. ఎందుకంటే..
Keerthy Suresh: సర్కారు వారి పాట కోసం ఎదురుచూస్తున్నాను.. ఆసక్తికర పోస్ట్ చేసిన కీర్తి సురేష్..
RC 15: డైరెక్టర్ శంకర్ భారీ ప్లాన్.. చరణ్ సినిమాలో హైలేట్ అవే.. కొత్త షెడ్యూల్ అప్పుడే స్టార్ట్..
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సినిమాలో మహేష్‌కు ఆ సాంగ్ ఇష్టం.. రచయత అనంత్ శ్రీరామ్..