AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetics: మధుమేహం ఉన్నవాళ్లు పాలు తాగేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి..

దేశంలో డయాబెటీస్ పేషెంట్లు రోజు రోజుకి పెరుగుతున్నారు. వీరు తీసుకునే ఆహారాన్ని బట్టి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఒక్కసారి డయాబెటీస్‌ బారిన పడితే జీవితాంతం ఆహారం, పానీయాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. లేదంటే రక్తంలో..

Diabetics: మధుమేహం ఉన్నవాళ్లు  పాలు తాగేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి..
Turmeric Milk
Amarnadh Daneti
|

Updated on: Nov 20, 2022 | 10:07 PM

Share

దేశంలో డయాబెటీస్ పేషెంట్లు రోజు రోజుకి పెరుగుతున్నారు. వీరు తీసుకునే ఆహారాన్ని బట్టి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఒక్కసారి డయాబెటీస్‌ బారిన పడితే జీవితాంతం ఆహారం, పానీయాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండవు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అల్పాహారంగా పాలు తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రోగులకు ప్రయోజనం ఉంటుంది. పాలు కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. ఉదయాన్నే పాలు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు మూడు పద్దతుల ద్వారా పాలు తీసుకుంటే మంచి ప్రయోజనాలు లభిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.

పసుపు పాలు

మధుమేహ వ్యాధిగ్రస్తులకు పసుపు పాలు చాలా మేలు చేస్తాయి. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.

దాల్చిన చెక్క పాలు

దాల్చిన చెక్క పాలు చక్కెర రోగులకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే దాల్చినచెక్క రక్తంలో చక్కెరను నియంత్రించడానికి పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. పాలు, దాల్చినచెక్క మిశ్రమంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఇవి కూడా చదవండి

బాదం పాలు

మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే బాదం పాలు మీకు చాలా మంచిది. బాదం పాలు మార్కెట్లో సులువుగా దొరుకుతాయి. మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. బాదం పాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్లు D, E, అవసరమైన పోషకాలు ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

Follow Us
మహిళలూ మీలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేయకండి..
మహిళలూ మీలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేయకండి..
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కాన్వాయ్‌పై కాల్పులు
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కాన్వాయ్‌పై కాల్పులు
ఉదయం నిద్రలేవగానే కళ్ల బరువు, వాపు వేధిస్తున్నాయా? కారణాలు ఇవే.. 
ఉదయం నిద్రలేవగానే కళ్ల బరువు, వాపు వేధిస్తున్నాయా? కారణాలు ఇవే.. 
పచ్చికొబ్బరి తింటున్నారా? రోజూ తినేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
పచ్చికొబ్బరి తింటున్నారా? రోజూ తినేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు రావచ్చు
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు రావచ్చు
6 బంతుల్లో 400 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత.. 19 ఏళ్ల రికార్డ్ బ్రేక్
6 బంతుల్లో 400 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత.. 19 ఏళ్ల రికార్డ్ బ్రేక్
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..