Liver Cancer: సైలెంట్‌గా విజృంభిస్తున్న లివర్ క్యాన్సర్.. ఈ 3 అలవాట్లు మీకుంటే ఇప్పుడే మానుకోండి..

మన రోజువారీ ఆహారం జీవనశైలి మన ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా లివర్ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచే అంశాలను కలిగి ఉంటాయి. కొన్ని ఆహారపు, జీవనశైలి అలవాట్లు, లివర్ ఆరోగ్యాన్ని సైలెంట్ గా దెబ్బతీస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మూడు అలవాట్లు ఉన్నవారిలో లివర్ క్యాన్సర్ రిస్క్ పొంచిఉందని అది మనం ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రమాదంతో కూడుకుని ఉంటుందని చెప్తున్నారు. ఆ మూడు అలవాట్లు మీకుంటే ఇప్పుడే వదిలేయండి.

Liver Cancer: సైలెంట్‌గా విజృంభిస్తున్న లివర్ క్యాన్సర్..  ఈ 3 అలవాట్లు మీకుంటే ఇప్పుడే మానుకోండి..
Habits Leads To Cancer Risk

Updated on: Apr 17, 2025 | 6:09 PM

లివర్ క్యాన్సర్ భారతదేశంలో ఒకప్పుడు అరుదైన వ్యాధిగా ఉండేది, కానీ ఇప్పుడు ఇది పెరుగుతున్న ఆరోగ్య సమస్యగా మారింది. చిప్స్, షుగరీ స్నాక్స్, ఇన్‌స్టంట్ నూడుల్స్, ఫాస్ట్ ఫుడ్ వంటి ఆహారాలు లివర్‌పై ఒత్తిడి తెస్తాయి. ఈ ఆహారాలు లివర్‌లో కొవ్వు పేరుకుపోవడానికి (ఫ్యాటీ లివర్) దారితీస్తాయి, ఇది లివర్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. సెడెంటరీ జీవనశైలి కూడా ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. లివర్ క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలు, అలసట, అనవసర బరువు తగ్గడం, ఉదరం పైభాగంలో నొప్పి, జాండిస్ (పసుపు చర్మం లేదా కళ్లు) తొలి దశలో స్పష్టంగా కనిపించకపోవచ్చు, కాబట్టి రెగ్యులర్ చెకప్‌లు చాలా ముఖ్యం.

అతిగా జంక్ ఫుడ్ ప్రాసెస్డ్ ఆహారం తినడం

చాలామంది చిప్స్, షుగరీ స్నాక్స్, ఇన్‌స్టంట్ నూడుల్స్, ఫాస్ట్ ఫుడ్‌లపై ఎక్కువ ఇష్టం పెంచుకుంటున్నారు. ఈ ఆహారాలు సాధారణంగా అనారోగ్యకరమైన కొవ్వులు చక్కెరలతో నిండి ఉంటాయి. దీర్ఘకాలంలో, ఇలాంటి ఆహారాలను తినడం వల్ల బరువు పెరగడం, మధుమేహం, లివర్‌ను నిశ్శబ్దంగా దెబ్బతీసే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ ఆహారాలు లివర్‌లో కొవ్వు పేరుకుపోవడానికి (ఫ్యాటీ లివర్) దారితీస్తాయి, ఇది లివర్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

తగినంత వ్యాయామం చేయకపోవడం

మనం ఎక్కువ సమయం డెస్క్‌ల వద్ద, స్క్రీన్‌ల ముందు, లేదా లాంగ్ జర్నీలతో సమయాన్ని గడుపుతూ ఉండొచ్చు. ఈ జీవనశైలి శరీరానికి అవసరమైన వ్యాయామాన్ని తగ్గిస్తుంది. ఇది ఫ్యాటీ లివర్ వ్యాధి అభివృద్ధి చెందే అవకాశాలను పెంచుతుంది, ఇది క్రమంగా లివర్ దెబ్బతినడానికి లేదా లివర్ క్యాన్సర్‌కు కూడా దారితీయవచ్చు. రెగ్యులర్ శారీరక శ్రమ లేకపోవడం లివర్ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

అతిగా మద్యం సేవించడం

అప్పుడప్పుడు మద్యం తాగడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ అదే పనిగా మందుకొట్టే వారిలో ఇది లివర్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నట్టు అధ్యయనాల్లో తేలింది. నిపుణుల ప్రకారం, మద్యం కనీసం ఆరు రకాల క్యాన్సర్‌లతో, ముఖ్యంగా లివర్ క్యాన్సర్‌తో సంబంధం కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 5% కంటే ఎక్కువ క్యాన్సర్ కేసులకు కారణమవుతుంది. దీని ఎఫెక్ట్ మనం ఊహించినదానికంటే ఎక్కువే ఉండొచ్చు.

పెరుగుతున్న ఫ్యాటీ లివర్ వ్యాధి

షుగరీ డ్రింక్స్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఆహారాల వినియోగం పెరగడం వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి యువకులు మరియు పిల్లలలో కూడా పెరుగుతోంది. ఒకప్పుడు ఫ్యాటీ లివర్ సంబంధిత హెపాటోసెల్యులర్ కార్సినోమా (హెచ్‌సీసీ) ఎక్కువగా సంపన్న వర్గాలలో కనిపించేది. కానీ ఇప్పుడు, ఇది అన్ని సామాజిక-ఆర్థిక నేపథ్యాల వారిని ప్రభావితం చేస్తోంది. ఈ సమస్యకు ఆదాయంతో సంబంధం లేకుండా, ఇది విస్తృతంగా వ్యాపిస్తోంది.