శీతాకాలంలో ప్రెగ్నెంట్ మహిళలకు సైంటిస్టుల హెచ్చరిక.. ఈ తప్పులొద్దు!

చలికాలంలో వాతావరణంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఈ మార్పుల వల్ల రోగనిరోధకత తక్కువగా ఉన్నవారికి రోగాలు చుట్టు ముడతాయి. అందుకే ఈ కాలంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యా నిపుణులు చెబుతుంటారు. అయితే ఈ కాలంలో గర్భిణీలు కూడా వీలైనంత జాగ్రత్తగా ఉండాలని, లేదంటే గర్భంలోని శిశువు పై తీవ్ర ప్రభావం పడుతుందని తాజా అధ్యనాలు వెల్లడించాయి..

శీతాకాలంలో ప్రెగ్నెంట్ మహిళలకు సైంటిస్టుల హెచ్చరిక.. ఈ తప్పులొద్దు!
Weather Temperature During Pregnancy

Updated on: Dec 27, 2025 | 2:38 PM

ఈసారి శీతాకాలం మరింత గజగజలాడిస్తుంది. ఇటువంటి వాతావరణంలో గర్భిణీలు తమ ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భధారణ సమయంలో చలికి ఎక్కువగా గురికావడం వల్ల గర్భంలోని శిశువు బరువును ప్రభావితం చేస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. పబ్‌మెడ్‌లో ప్రచురించబడిన ఈ శాస్త్రీయ అధ్యయనం ఇతర ప్రపంచ ఆరోగ్య సంస్థల డేటా ఆధారంగా రూపొందించబడింది. ముఖ్యంగా శీతాకాలంలో గర్భిణీలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడానికి దీని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. గర్భధారణ సమయంలో పర్యావరణ ఉష్ణోగ్రత.. శిశువు శారీరక అభివృద్ధికి సంబంధాలు ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

చలి వాతావరణం గర్భస్థ శిశువు బరువును ఎలా ప్రభావితం చేస్తుంది?

పరిశోధన ప్రకారం గర్భధారణ సమయంలో వాతావరణంలో చలి తీవ్రంగా ఉంటే కొన్ని సందర్భాల్లో పుట్టినప్పుడు శిశువు బరువు సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందట. ఉష్ణోగ్రతలో నిరంతర తగ్గుదల గర్భంలో శిశువు అభివృద్ధిని ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భంతో ఉన్నప్పుడు రెండవ, మూడవ నెలలో వాతావరణం పాత్ర చాలా ముఖ్యమైనది. ఇది అందరికీ ఒకేలా ఉండనవసరం లేదు. కానీ పర్యావరణం, ఆరోగ్య పరిస్థితులు వంటి అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని పరిశోధకులు స్పష్టం చేశారు. డేటా ఆధారంగా చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జన్మించిన కొంతమంది శిశువులు సాధారణం కంటే తక్కువ బరువు కలిగి ఉన్నట్లు కనుగొన్నారు.

శిశువుల్లో ఎలాంటి సమస్యలు వస్తాయంటే?

ఆర్‌ఎంఎల్ హాస్పిటల్‌లోని ప్రసూతి, గైనకాలజీ విభాగం డాక్టర్ సలోని చాధా మాట్లాడుతూ.. తక్కువ బరువుతో జన్మించిన పిల్లలు మొదట్లో కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. పరిశోధన ప్రకారం అలాంటి పిల్లలు ఇన్ఫెక్షన్లకు ఎక్కువగా గురవుతారు. వీరికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. అంతేకాకుండా కొంతమందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, బలహీనత, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ఇబ్బంది కూడా ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో పెరుగుదల సమస్యలు కూడా వస్తాయి. కానీ గర్భంతో ఉన్నప్పుడు సకాలంలో సంరక్షణ చర్యలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలను తగ్గించవచ్చని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

  • శీతాకాలంలో శరీరాన్ని ఎల్లప్పుడూ వెచ్చగా ఉంచుకోవాలి.
  • సమతుల్య, పోషకమైన ఆహారం తీసుకోవాలి.
  • క్రమం తప్పకుండా డాక్టర్ వద్ద తనిఖీ చేయించుకోవాలి.
  • తగినంత విశ్రాంతి, నిద్ర తీసుకోవడం మర్చిపోవద్దు.
  • జలుబు, ఫ్లూ మరే ఇతర అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.