Director of health : ‘ప్రజల ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది..’ పొలిటికల్‌ లీడర్లకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌ స్వీట్‌ వార్నింగ్‌

|

Jul 20, 2021 | 5:38 PM

'ప్రజల ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది.. ప్రజారోగ్యం మీ బాధ్యత' అంటూ పొలిటికల్‌ లీడర్లకు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు DH (డైరెక్టర్ ఆఫ్ హెల్త్)‌ శ్రీనివాసరావు. పండగలు వస్తుంటాయ్‌.. పోతుంటాయ్‌....

Director of health : ప్రజల ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది.. పొలిటికల్‌ లీడర్లకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌  స్వీట్‌ వార్నింగ్‌
Telangana Public Health Director
Follow us on

Telangana Director of Health Srinivasarao : ‘ప్రజల ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది.. ప్రజారోగ్యం మీ బాధ్యత’ అంటూ పొలిటికల్‌ లీడర్లకు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు DH (డైరెక్టర్ ఆఫ్ హెల్త్)‌ శ్రీనివాసరావు. పండగలు వస్తుంటాయ్‌.. పోతుంటాయ్‌.. ప్రాణాలు పోతే తిరిగిరావంటూ హెచ్చరించారాయన. రాష్ట్రంలో పొలిటికల్‌ యాక్టివిటీ పెరిగిపోయిందని DH‌ శ్రీనివాసరావు ఇవాళ టీవీ9తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. పాదయాత్రలు, ర్యాలీల్లో కరోనా నిబంధనలు కఠినంగా పాటించాలని సూచించారు. కరోనాకట్టడికి వైద్యారోగ్యశాఖ నిరంతరం పనిచేస్తోందన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా డెల్టా వేరియంట్‌ వేగంగా విస్తరిస్తోందన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనాను తక్కువ సమయంలో కట్టడి చేయగలిగామన్న DH.. మరో రెండు నెలలు కరోనా ముప్పు పొంచి ఉందన్నారు. కరోనాపై ప్రజల్లో నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోందని.. అజాగ్రత్తగా ఉంటే థర్డ్‌వేవ్‌ వచ్చే ప్రమాదముందని శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదిలాఉండగా, దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. సోమవారం కరోనా నుంచి 45,254 మంది కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,03,53,710కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,06,130 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 97.32శాతంగా ఉంది. ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ దేశంలో 41 కోట్ల మందికిపైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటి నుంచి మంగళవారం ఉదయం వరకూ దేశవ్యాప్తంగా 41,18,46,401 డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.

Read also: Seethakka : ఫారెస్ట్ అధికారులకు ఎమ్మెల్యే సీతక్క వార్నింగ్.. పోడు భూముల జోలికొస్తే..