Garlic Benefits: ఈ రెండు పదార్థాలు తీసుకోండి చాలు.. బీపీ, గుండెపోటు దూరమవుతాయి..!

| Edited By: Shaik Madar Saheb

Apr 12, 2022 | 6:00 AM

ఈ రోజుల్లో బీపీ(BP) కామన్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో గుండెపోటు(heart stroke) వచ్చి చనిపోయేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది. రెండు పదార్థాలను తీసుకోవడం వల్ల గుండెపోటు, రక్తపోటును దూరం చేయ్యొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Garlic Benefits: ఈ రెండు పదార్థాలు తీసుకోండి చాలు.. బీపీ, గుండెపోటు దూరమవుతాయి..!
Garlic And Beetroot
Follow us on

ఈ రోజుల్లో బీపీ(BP) కామన్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో గుండెపోటు(heart stroke) వచ్చి చనిపోయేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది. రెండు పదార్థాలను తీసుకోవడం వల్ల గుండెపోటు, రక్తపోటును దూరం చేయ్యొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ పదార్థలు ఏమిటంటే ఒకటోది వెల్లు( garlic) కాగా రెండోది బీట్‌ రూట్(beetroot).. ఈ రెండూ గుండెపోటు, అధిక రక్తపోటు ప్రమాదాల్ని దూరం చేయడంలో అద్భుతమైన ఔషధాలుగా పని చేస్తాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వెల్లుల్లి, బీట్‌రూట్‌లతో అధిక రక్తపోటుకు ఏమైనా సంబంధముందా..ఈ రెండూ తీసుకుంటే హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ ఎటాక్ ప్రమాదం తగ్గుతుందా..తాజా అధ్యయనం ఏం చెబుతోందో తెలుసుకుందాం. బ్రిటన్‌కు చెందిన డాక్టర్ క్రిస్ వాన్ చేసిన అధ్యయనం ఆసక్తికర విషయాల్ని బయట పెట్టింది. ప్రజల ప్రాణాల్ని కాపాడటంలో ఈ రెండు పదార్థాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయని తెలిసింది.

28 మంది వాలంటీర్లపై ఈ అధ్యయనం చేశారు. రీసెర్చ్ ప్రారంభించడానికి ముందు మ్యాగ్జిమమ్ బీపీ వీరిలో 130 వరకూ ఉంది. సాధారణంగా 120 ఉండాలి. ఆ తరువాత వీరిని రెండు వేర్వేరు గ్రూపులుగా విభజించి..3 వారాల వరకూ వెల్లుల్లి, బీట్‌రూట్ ఇచ్చారు. ఆ తరువాత ఫలితాలు చూస్తే చాలా మెరుగ్గా కనిపించాయి. అటు బీట్‌రూట్, ఇటు వెల్లుల్లి తీసుకున్నవారిలో బీపీ 2-3 పాయింట్లు తగ్గిందట. అటు హార్ట్ అటాక్ ముప్పు కూడా పది శాతం తగ్గిందని చెబుతున్నారు. ఇది కేవలం 3 వారాల అధ్యయనంతో తేలిన విషయం మాత్రమే. 2-3 నెలలు కంటిన్యూగా తీసుకుంటే బీపీ మరింతగా తగ్గే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు. ఈ రెండూ తీసుకోవడం వల్ల రక్తనాళం వ్యాకోచించి..రక్తం సులభంగా ప్రవహిస్తుందట.

బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్, వెల్లుల్లిలోని ఎలిసిన్‌తో చాలా ప్రయోజనాలుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నైట్రేట్ అనేది అన్ని రకాల పచ్చని ఆకుగూరల్లో పుష్కలంగా ఉంటుంది. బీట్‌రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల నైట్రేట్ పుష్కలంగా లభిస్తుందట. ఒకవేళ బీట్‌రూట్‌ను ఉడకబెట్టాలనుకుంటే.. ఏ చిన్న భాగం కూడా తొలగించకుండా పూర్తిగా అలాగే ఉడకబెట్టాలి. ఆకుకూరల్ని ఉడకబెట్టే కంటే స్టీమ్ కుక్ చేసి తినడం మంచిది. లేదా తక్కువ నీటిలో ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తరువాత మిగిలిన నీళ్లను సూప్ లేదా ఇతర పదార్ధాల్లో కలిపి తీసుకుంటే మంచిదని నిపుణులు వివరుస్తున్నారు.

Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి.

Read Also.. Dry Fruits: ఎండాకాలంలో డ్రైఫూట్స్‌ తింటున్నారా..? అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి..