Pumpkin Benefits: కడేవడంత గుమ్మడికాయ కత్తి పీటకు లోకువ.. గుమ్మడి కాయల దొంగ ఎవరంటే బుజాలు తడుముకున్నట్టు ఇలాంటి సామెతను తరచుగా వాడుతూ.. గుమ్మిడికాయతో తెలుగువారి అనుబంధాన్ని చెప్పకనే చెప్పింది. అయితే ఈ గుమ్మడికి కాయను చాలా తక్కువమంది కూరగా చేసుకుని తింటారు.. అయితే ఆంధ్రాలో ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో గుమ్మడికాయ పెళ్లిళ్లకు , ఫంక్షన్లల్లో వంటల్లో తప్పని సరిగా ఉపయోగిస్తారు. గుమ్మడి లో అనేక ఔషధ గుణాలున్నాయని.. రోగ నిరోధక శక్తికి సహాయపడుతుందని అందరూ తప్పని సరిగా తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సి, ఇ, ఎ.. ఐరన్ పుష్కలంగా ఉన్న గుమ్మడికాయ తింటే కలిగే అద్భుత ప్రయోజలు తెలిస్తే వదిలి పెట్టరు.
*జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి సీజనల్ వ్యాధులను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
*రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహయపడుతుంది.
*దీనిలో ఉన్న విటమిన్ ఎ కంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.
*హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది.
* గుమ్మడికాయతో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎక్కువగా తీసుకోవడం వలన రక్తహీనత వంటి సమస్యలు తగ్గుతాయి.
*అలాగే వర్షాకాలంలో ఎదురయ్యే అంటువ్యాధులను తగ్గించడానికి తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేస్తాయి.
*గుమ్మడి కాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.పైబర్ బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఫైబర్ జీర్ణ ప్రక్రియపై ఎక్కువగా ప్రభావం చూపడమే కాకుండా.. ఆకలిని నియంత్రిస్తుంది.
*ఇక కేలరీలతో పాటు కొవ్వు కూడా తక్కువగా ఉంటుంది.
అంతేకాదు గుమ్మడికాయలో విటమిన్ ఎ అధికంగా ఉండడం వలన కళ్లకు మేలు చేస్తుంది.
*చర్మం కాంతివంతంగా ఉంచే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.
ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న గుమ్మడికాయను ఇకనైనా అప్పుడప్పుడు తిందాం.. సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందుదాం.
Also Read: పెళ్లిపీటల మీద పూల దండలకు బదులు పానీ పూరీలను ధరించిన నవ వధువు.. సోషల్ మీడియాలో వైరల్