Summer Health Tips: దోసకాయ తినేటప్పుడు పొట్టు తీస్తున్నారా? ఇది తెలిస్తే ఇక ఆ పని చేయరు..

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలలో దోసకాయ ఒకటి. ఇది శరీరానికి అవసరమైన శక్తితో పాటు తక్షణ తాజాదనాన్ని ఇస్తుంది. దోసకాయను భోజనం, సలాడ్, ఊరగాయలా అనేక రకాలుగా తినవచ్చు. అయితే, చాలా మంది దోసకాయను పొట్టు తీసి తింటారు. కానీ అలా చేయడం చాలా పెద్ద పొరపాటు చేసినట్లేనని చెబుతున్నారు నిపుణులు.

Summer Health Tips: దోసకాయ తినేటప్పుడు పొట్టు తీస్తున్నారా? ఇది తెలిస్తే ఇక ఆ పని చేయరు..
కీరదోస.. వీటిలో నీటి కంటెంట్‌తో పాటు ఫైబర్, విటమిన్లు బీ1, బీ2, బీ3, బీ5, బీ6, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, జింక్‌లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడతాయి. అంతేకాక వేడి వేసవి నెలల్లో మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. కాబట్టి, మీరు అలసిపోయినట్లు అనిపించినప్పుడల్లా మీ శక్తి స్థాయిలను తిరిగి పొందడానికి కీరదోసకాయలను తినవచ్చు.

Updated on: Mar 31, 2023 | 7:13 AM

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలలో దోసకాయ ఒకటి. ఇది శరీరానికి అవసరమైన శక్తితో పాటు తక్షణ తాజాదనాన్ని ఇస్తుంది. దోసకాయను భోజనం, సలాడ్, ఊరగాయలా అనేక రకాలుగా తినవచ్చు. అయితే, చాలా మంది దోసకాయను పొట్టు తీసి తింటారు. కానీ అలా చేయడం చాలా పెద్ద పొరపాటు చేసినట్లేనని చెబుతున్నారు నిపుణులు. పొట్టు తీయకుండా దోసకాయ తినడం వలన పుష్కలంగా పోషకాలను పొందవచ్చు అని చెబుతున్నారు. దీని తొక్కలో విటమిన్ కె, విటమిన్ సి వంటి అనేక ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతారు.

అయితే, దోసకాయ తినడానికి ముందు దానిని తినే విధానం గురించి తెలుసుకోవాలి. ప్రస్తుత రోజుల్లో, ఇంట్లో పండించిన దోసకాయలు తినే వారి కంటే మార్కెట్ నుండి కొనుగోలు చేసేవారే ఎక్కువగా ఉన్నారు. అందుకే దోసకాయలను తినడానికి ముందు వాటిని బాగా కడగాలి. లేదంటే.. ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. దోసకాయను వేడి నీటితో కడిగిన తర్వాత తింటే.. దానిలోని సింథటిక్ వ్యాక్స్ దెబ్బతినకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. దోసకాయలు విటమిన్లు సి, కె, పొటాషియం, మెగ్నీషియంతో సహా పోషకాలతో నిండి ఉన్నాయి. ఇవి డైటరీ ఫైబర్‌కు మంచి మూలం. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.

దోసకాయలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని సెల్ డ్యామేజ్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. దోసకాయలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియం, ఐరన్ వంటి వివిధ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దోసకాయలను సలాడ్, జ్యూస్ రూపంలో క్రమం తప్పకుండా తీసుకోవాలి. వేసవి కాలంలో ఇది మార్కెట్‌లో విరివిగా దొరుకుతుంది. ఈ సీజన్‌లో దీన్ని తగినంత పరిమాణంలో తీసుకోవాలి. దోసకాయను రోజూ తింటే శరీరంలో నీటి కొరత ఉండదు. దీన్ని తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..