Summer Foods: ఎండాకాలం శరీరం చల్లగా ఉండాలంటే వీటిని కచ్చితంగా తినాల్సిందే..!

|

May 03, 2022 | 1:30 PM

Summer Foods: ఎండాకాలం అధిక వేడివల్ల ప్రజలు తరచుగా అలసిపోతారు. వేడి నుంచి ఉపశమనం పొందడానికి అనేక రకాల ఆహారాలను తింటారు.

Summer Foods: ఎండాకాలం శరీరం చల్లగా ఉండాలంటే వీటిని కచ్చితంగా తినాల్సిందే..!
Summer Foods
Follow us on

Summer Foods: ఎండాకాలం అధిక వేడివల్ల ప్రజలు తరచుగా అలసిపోతారు. వేడి నుంచి ఉపశమనం పొందడానికి
అనేక రకాల ఆహారాలను తింటారు. కానీ మీరు డైట్‌లో నీరు అధికంగా ఉండే ఆహారాలని చేర్చుకుంటే మంచిది. ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది. శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. ఇందులో పుచ్చకాయ, దోసకాయ చాలా ముఖ్యమైన ఆహారాలు. వీటిని అస్సలు మిస్‌ కాకూడదు. వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.

1. పుచ్చకాయ

సీజనల్ పండ్లు శరీరానికి చాలా మేలు చేస్తాయి. పుచ్చకాయలో విటమిన్ ఎ, సి, బి విటమిన్లు అలాగే పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, లైకోపీన్, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఇవి క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదం చేస్తాయి. పుచ్చకాయలో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి పనిచేస్తుంది.

2. టమోటా

టమోటాలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించడంలో ఇవి సహాయపడతాయి. టామోటాలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటు స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. టమోటాలో విటమిన్ బి, విటమిన్ ఈ, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది.

3. పెరుగు

వేసవిలో పెరుగు తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది మీకు శక్తిని ఇస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. పెరుగులో చిటికెడు ఉప్పు, పంచదార కలిపి తింటే చలువ చేస్తుంది. దీని వల్ల శరీరం మరింత సమతుల్యంగా శక్తివంతంగా తయారవుతుంది. పెరుగు ఆందోళన తగ్గిస్తుంది.

4. దోసకాయ

దోసకాయలో 90 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇది గొప్ప సిస్టమ్ ప్యూరిఫైయర్. దోసకాయలో ఫైబర్ ఉంటుంది. ఇది తక్కువ మొత్తంలో కేలరీలను కలిగి ఉంటుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. దోసకాయలో పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో పనిచేస్తాయి.

5. కొబ్బరి నీరు

ఎండాకాలంలో కొబ్బరినీళ్లు చక్కటి పానీయం. ఇందులో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు ఉంటాయి. ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఇది వేడి వాతావరణంతో పోరాడటానికి సహాయపడుతుంది. నిత్యం కొబ్బరినీళ్లు తాగడం వల్ల అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Heart Function: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి..!

IPL 2022, Orange Cap: టాప్‌ 5లోకి దూసుకొచ్చిన శ్రేయాస్‌ అయ్యర్.. వెనుకబడిన హార్దిక్ పాండ్య..!

ITC MAARS App: రైతులకి గుడ్ న్యూస్‌.. సమస్యల పరిష్కారానికి ఐటీసీ మార్స్‌ యాప్..!