Hair Loss: జుట్టు ఎందుకు రాలుతుంది.? బట్టతల ఎందుకు వస్తుంది.. జుట్టు బలంగా ఉండేందుకు చిట్కాలు..!

|

Dec 27, 2021 | 3:09 PM

Hair Loss: ప్రస్తుతం ఎంతో మందిని వేధిస్తున్న సమస్య జట్టు రాలడం. కాలుష్యం, టెన్షన్, ఇతర కారణాల వల్ల చాలా మందికి జుట్టు రాలిపోతుంటుంది. కొందరికి జుట్టు తెల్లబడటం..

Hair Loss: జుట్టు ఎందుకు రాలుతుంది.? బట్టతల ఎందుకు వస్తుంది.. జుట్టు బలంగా ఉండేందుకు చిట్కాలు..!
Follow us on

Hair Loss: ప్రస్తుతం ఎంతో మందిని వేధిస్తున్న సమస్య జట్టు రాలడం. కాలుష్యం, టెన్షన్, ఇతర కారణాల వల్ల చాలా మందికి జుట్టు రాలిపోతుంటుంది. కొందరికి జుట్టు తెల్లబడటం బాధిస్తుంటుంది. ముఖ్యంగా చిన్నవయసులోనే బట్టతల రావడం మానసికంగా మరింతగా కుంగదీస్తోంది. దీంతో చాలా మంది జట్టును రాలకుండా ఉండేందుకు, తెల్లబడకుండా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా ఫలితం ఉండదు. మరి జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

జట్టు ఎందుకు ఊడిపోతుంటుంది..?
మానవ జన్యువుల్లో బాల్డ్‌నెస్‌ జీన్స్‌ ఆండ్రొజెనిటిక్‌ అలోపిసియా కారణంగా బట్టతల వస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. మనం ఎదుర్కొనే ఒత్తిళ్లు, పోషకాహార లోపం కారణంగా కూడా వెంట్రుకలు రాలిపోయి బట్టతల వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక మహిళల్లో మెనోపాజ్‌, గర్భధారణం తదితర సమయాలలో హర్మోన్ల విడుదలలో వచ్చే మార్పుల వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక పురుషుల్లో, మహిళల్లో గుండె వ్యాధులు, డయాబెటిస్‌, బీపీ, అర్థరైటిస్‌ వంటి వ్యాధులతో బాధపడేవారు మందులు వాడటం వల్ల జుట్టు ఊడిపోతుంటుంది.

జుట్టు రాలడం ఆపాలంటే..
వాస్తవానికి బట్టతలను అడ్డుకోవడం అనేది కొంత కష్టమైన పనే. అయితే బట్టతల రావడానికి కొంత జాప్యం చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. జన్యు సంబంధిత, ఇతర కారణాలతో వచ్చే బట్టతలను పూర్తిగా ఆపలేకున్నా.. కొన్ని సంవత్సరాల పాటు బట్టతల రాకుండా చేయవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

పోషకాహారం లోపం..
పోషకాహారం లోపం వల్ల కూడా జట్టు ఊడిపోతుంటుంది. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడం మంచిదంటున్నారు. తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్‌ ఎక్కువ ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. అలాగే తగినంత వ్యాయామం, సరైన నిద్ర ఎంతో అవసరమంటున్నారు. బయటకు వెళ్లినప్పుడు పొల్యూషన్‌లో తిరిగినప్పుడు తలను స్కార్ఫ్ లేదా క్యాప్‌తో కవర్‌ చేయడం మంచిది. దీని వల్ల జుట్టు ఊడిపోయే సమస్యను తగ్గించుకోవచ్చు. తలపై పేరుకుపోయిన ధుమ్ము వల్ల చుండ్రు ఏర్పడుతుంది. దీంతో ఎప్పటికప్పుడు రోజువారీగా షాంపూతో తలను శుభ్రం చేసుకోవడం మంచిది. మగవారు అయితే రోజు విడిచి రోజు, మమిళలు అయితే వారానికి కనీసం రెండు, మూడు సార్లు తలస్నానం చేయడం మంచిదంటున్నారు నిపుణులు. కొందరు తల దువ్వుకునే క్రమంలో చిక్కుళ్లు పడిన వెంట్రుకలను దువ్వెనతో బలంగా దువ్వుతుంటారు. అలా బలంగా దువ్వడం వల్ల కుదుళ్లు బలహీనంగా మారి జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉందంటున్నారు. అలాగే కొందరు తలకు నూనె పెట్టుకునేందుకు ఇష్టపడరు. జిడ్డుగా మారుతుందని అనుకుంటారు. కానీ స్నానం చేసే ముందు తలకు నూనె పెట్టుకోవడం వల్ల జుట్టు బలంగా మారుతుంది. జుట్టు రాలడం, బట్టతల రావడం సమస్యను అధిగమించవచ్చు అని అంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి:

Covid Vaccine: 15-18 ఏళ్ల టీనేజర్లకు గుడ్‌న్యూస్.. కోవిన్‌‌లో రిజిస్ట్రేషన్ ఎప్పటినుంచంటే..?

Cholesterol Food: మీ శరీరంలో కలెస్ట్రాల్‌ పెరిగిపోతోందా..? ప్రమాదమే..!