Stomach Gas Remedies: కొంచెం తిన్నా గ్యాస్ తన్నుకొస్తుందా..? ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో తెలుసుకోండి

కడుపులో గ్యాస్ సమస్యకు కారణం ఏమిటి, ఈ సమస్యను ఎలా వదిలించుకోవాలి అనే విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవడం ముఖ్యం..

Stomach Gas Remedies: కొంచెం తిన్నా గ్యాస్ తన్నుకొస్తుందా..? ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో తెలుసుకోండి
Stomach Gas Remedies

Updated on: May 15, 2022 | 9:44 AM

Stomach Gas Remedies: ప్రస్తుత కాలంలో.. చాలామంది కడుపులో గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే.. గ్యాస్ సమస్యను కొన్నిసార్లు చాలా చిన్న సమస్యగా భావిస్తుంటారు. కానీ.. ఇది క్రమంగా అసౌకర్యం కలిగించడమే కాకుండా తీవ్ర నొప్పికి దారితీస్తుంది. కడుపులో ఆటంకం ఏర్పడినప్పుడు.. సాధారణ పని చేయడంలో కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. కడుపులో గ్యాస్ ఉంటే.. హాయిగా కూర్చోవడం కష్టం అవుతుంది. అటువంటి పరిస్థితిలో.. కడుపులో గ్యాస్ సమస్యకు కారణం ఏమిటి, ఈ సమస్యను ఎలా వదిలించుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు పలు చిట్కాలు పాటించాలని నిపునులు సూచిస్తున్నారు.

కడుపులో గ్యాస్‌కు కారణం..

  • చాలామంది ప్రజలు ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో టీ తాగుతారు. దీనిని సాధారణంగా ‘బెడ్ టీ’ అని పిలుస్తారు. ఏమీ తినకుండా టీ తాగడం వల్ల ఎసిడిటీ వస్తుంది, దీని వల్ల పొట్టలో గ్యాస్ సమస్యలు వస్తాయి. పని ఒత్తిడి, జిజీ షెడ్యూల్, సమయాభావం కారణంగా చాలామంది ఆహారం సరిగా తినరు. సమయానుకూలంగా తినకుండా.. ఎప్పుడెప్పుడో తింటుంటారు. దాని కారణంగా జీర్ణక్రియ సమస్య మొదలై తరువాత గ్యాస్ సమస్యగా మారుతుంది.
  • లాక్టోస్ ఆహార పదార్థాలు లేదా దాని నుంచి తయారైన ఉత్పత్తులు కలిగి ఉన్న ఎక్కువ పాలు తాగితే.. అది గ్యాస్ ఏర్పడటానికి కారణం అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో వాటిని ఏ పరిమాణంలో తినాలనేది.. నిపుణుల నుంచి తెలుసుకోవాలి.
  • చెడు అలవాట్లు కూడా ఉదరంపై ప్రభావం చూపుతాయి.
  • ఏదైనా కారణం వల్ల మీ ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే అది గ్యాస్ సమస్యను సృష్టిస్తుంది .

గ్యాస్ సమస్యను ఇలా వదిలించుకోండి..

  • సోంపు నీటిని తాగడం వల్ల పొట్టకు సంబంధించిన అవాంతరాలు తొలగిపోతాయి. ఇందుకోసం రాత్రిపూట సోపు నీటిని నానబెట్టి, ఉదయాన్నే వడపోసి ఆ నీటిని తాగాలి.
  • ఆయిల్, స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినడం మానేయండి. ఇది కాకుండా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్‌లకు దూరంగా ఉండటం మంచిది.
  • పుదీనా వాటర్ తాగడం, దాని ఆకులను తినడం వల్ల వేసవి కాలంలో గ్యాస్ సమస్య నుంచి గొప్ప ఉపశమనం లభిస్తుంది.
  • చిన్న పాత్రలో నీళ్లు పోసి అందులో అల్లం వేసి మరిగించి గోరువెచ్చగా అయ్యాక తాగాలి.
  • కొద్ది సేపు నడవాలి. ఇలా చేయడం వల్ల పొట్టలోంచి గ్యాస్ బయటకు వస్తుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read:

Weight Loss Drink: ఈ మసాలా డ్రింక్‌తో కొవ్వు వెన్నలా కరిగిపోతుంది.. బరువు కూడా ఈజీగా తగ్గొచ్చు.. 

High BP Control Tips: మందులు లేకుండానే హైబీపీ సమస్యకు ఇలా చెక్ పెట్టండి.. సింపుల్ టిప్స్ మీకోసమే..

Fenugreek: మెంతులతో చుండ్రు సమస్యలకి చెక్‌.. ఈ విధంగా చేయండి..!