Steam Bath Benefits: స్టీమ్ బాత్ చేస్తే.. అలాంటి సమస్యలు మటుమాయమట.. ఇంకా మరెన్నో ప్రయోజనాలు

|

Dec 24, 2021 | 1:09 PM

Steam Bath Health Benefits: రిఫ్రెష్ కోసం మనమందరం ప్రతిరోజూ స్నానం చేస్తాం. నేటి కాలంలో.. స్నానమాచరించడం కూడా ఆరోగ్యానికి సంబంధించిన ఫిట్‌నెస్‌లో

Steam Bath Benefits: స్టీమ్ బాత్ చేస్తే.. అలాంటి సమస్యలు మటుమాయమట.. ఇంకా మరెన్నో ప్రయోజనాలు
Steam Bath Benefits
Follow us on

Steam Bath Health Benefits: రిఫ్రెష్ కోసం మనమందరం ప్రతిరోజూ స్నానం చేస్తాం. నేటి కాలంలో.. స్నానమాచరించడం కూడా ఆరోగ్యానికి సంబంధించిన ఫిట్‌నెస్‌లో భాగమైంది. ఆవిరి స్నానం (స్టీమ్ బాత్) చేస్తే అది మీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. స్టీమ్ బాత్ (ఆవిరి స్నానానికి) కు ఆయుర్వేదంతోపాటు వైద్యశాస్త్రంలో కూడా ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు. ఆవిరి స్నానం చేయడం వల్ల మన శరీరాన్ని ఫిట్‌గా ఉంచడమే కాకుండా.. చర్మాన్ని అందంగా మార్చడంలో కూడా సహాయపడుతుంది. అవును.. శీతాకాలంలో మనందరం చలికి దూరంగా ఉండేందుకు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తాం. కానీ మీకు తెలుసా.. ఆవిరి స్నానం చలి నుంచి మనల్ని సురక్షితంగా కాపాడతుంది. అలాగే శరీరంలోని అలసట, కీళ్ల సమస్యలను తొలగిస్తుందని అధ్యయనంలో తేలింది.

అంతే కాదు స్టీమ్ బాత్ తీసుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి స్టీమ్ బాత్ వల్ల మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా చాలా వేడిగా మారుతుంది. దీని కారణంగా… మేము వేడి శ్వాసను కూడా తీసుకుంటాము. దీని నుంచి వచ్చే వేడి శ్వాస ఊపిరితిత్తులలోకి వెళ్లడం ద్వారా కఫాన్ని బయటకు తీయడంలో సహాయపడుతుంది. స్టీమ్ బాత్‌ను చికిత్సకు కూడా ఉపయోగిస్తారు. కావున ఆవిరి స్నానం.. ప్రత్యేక ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది.
హృద్రోగులకు స్టీమ్ బాత్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్టీమ్ బాత్ రక్తప్రసరణను మెరుగుపరుస్తుందని పేర్కొంటున్నారు. మీరు ప్రతిరోజూ స్టీమ్ బాత్ చేస్తుంటే, మీరు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడంతోపాటు చర్మాన్ని కాంతి వంతంగా మార్చుకోవచ్చు. వేసవి కాలంలో చెమటలు పట్టడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ఆవిరి స్నానం చేస్తే శరీరంలోని మురికి తొలగిపోవడంతో పాటు చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి.

రక్తపోటును తగ్గిస్తుంది..
ఒక అధ్యయనం ప్రకారం.. ఆవిరి స్నానం చేసే వ్యక్తుల శరీరం నుంచి పలు హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి హృదయ స్పందన రేటును తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు ప్రతిరోజూ ఈ స్నానం చేస్తే మీ రక్త ప్రసరణ ఎల్లప్పుడూ చక్కగా ఉంటుంది. దీంతోపాటు మీరు అనేక రకాల వ్యాధుల నుంచి కూడా దూరంగా ఉంటారు. ముఖ్యంగా శీతాకాలంలో.. ఆవిరి స్నానాలు కండరాలు, కీళ్లలో దృఢత్వం నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది
అంతే కాదు.. మీరు సరైన మార్గంలో స్టీమ్ బాత్ తీసుకుంటే.. అది కేలరీలను బర్న్ చేయడంలో కూడా సహాయపడుతుంది. ఇది మీ బరువు తగ్గడానికి దారితీస్తుంది. వేడి నీళ్లతో స్నానం చేస్తే.. ఇది ల్యూకోసైట్‌లను ప్రేరేపిస్తుంది. ఇది కణాలను ఇన్‌ఫెక్షన్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. ఆవిరి స్నానం మీ రోగనిరోధక శక్తిని మరింత మెరుగుపరుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

స్టీమ్ బాత్ మనస్సును ఉల్లాసపరుస్తుంది. దీనితో పాటు, ఇది శరీరం నుంచి అలసట, నిద్రలేమి సమస్యలను కూడా తొలగిస్తుంది. అంతే కాదు ఆవిరి స్నానం చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. అందుకే.. నిపుణులు సాధ్యమైతే స్టీమ్ బాత్ బెస్ట్ అంటూ సూచిస్తున్నారు.

Also Read:

ఈ అలవాట్లు మానుకోక పోతే మీకు వృద్దాప్యం ముందే వస్తుంది.. అవేంటో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

Fish Benefits: చేపలు ఎక్కువగా తినేవారికి అలాంటి సమస్యలు రావు.. తాజా పరిశోధనలలో కీలక అంశాలు