Health Tips: గంటల తరబడి ఒకే చోట కూర్చుంటున్నారా? ఈ వార్నింగ్ బెల్ మీకోసమే..

Health Tips: ఆధునిక కాలంలో అస్తవ్యస్తమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, గంటల తరబడి ఒకే చోట కూర్చుని పని చేయడం వంటి కారణాల

Health Tips: గంటల తరబడి ఒకే చోట కూర్చుంటున్నారా? ఈ వార్నింగ్ బెల్ మీకోసమే..
Spondylitis

Updated on: Jul 18, 2022 | 6:30 PM

Health Tips: ఆధునిక కాలంలో అస్తవ్యస్తమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, గంటల తరబడి ఒకే చోట కూర్చుని పని చేయడం వంటి కారణాల వల్ల చాలా మంది స్పాండిలైటిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. స్పాండిలైటిస్ అనేది కీళ్లనొప్పుల సమస్య. ముఖ్యంగా వెన్నపాములో తీవ్రమైన నొప్పి వస్తుంది. వెన్నుపాము నుండి ప్రారంభమై.. శరీరం అంతా ప్రభావితం అవుతుంది. తుంటి నొప్పి, భుజం నొప్పి వంటి కీళ్ల సమస్యలు తలెత్తుతాయి. అయితే, స్పాండిలైటిస్ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి అనేక చిట్కాలు ఉన్నాయి. నిపుణులు సూచిస్తున్న ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కూర్చునే విధానం..
చాలామంది గంటల తరబడి ఒకే చోట కూర్చుని పని చేస్తుంటారు. అలా గంటల తరబడి కూర్చోవడం వల్ల సరైన భంగిమలో కూర్చోరు. దాంతో స్పాండిలైటిస్ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే.. కూర్చునే విధానం సరిగా ఉండాలి. కుర్చీలో నిటారుగా కూర్చునే ప్రయత్నం చేయాలి.

యోగా చేయాలి..
స్పాండిలైటిస్‌ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి యోగా ఉపకరిస్తుంది. నిత్యం యోగా చేయడం వల్ల ఎముకల సమస్యల నుంచి అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి..
స్పాండిలైటిస్ సమస్య పోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. కాల్షియం, విటమిన్ డి, ఇతర మినరల్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

ఇతర చిట్కాలు..
1. కెఫిన్ కలిగిన ఆహారం నుండి దూరంగా ఉండండి.
2. ధూమపానం, మద్యానికి దూరంగా ఉండాలి.
3. రెగ్యులర్ మసాజ్ చేయించుకోవాలి.
4. ఆక్యుపంక్చర్ థెరపీ చేయించుకోవచ్చు.
5. గట్టి బెడ్‌పై నిద్రించాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..