Sesame Home Remedies: రోజూ ఒక్క స్ఫూన్ నువ్వులు తింటే.. ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే మైండ్ బ్లాకే!!

|

Aug 08, 2023 | 12:49 PM

మనం ఎదుర్కొనే అనారోగ్యాలకు 90 శాతం పరిష్కారం మనం తినే ఆహారంలోనే ఉంటుంది. అందులోనూ ఇంటి ఫుడ్ ల ఉండే ఆరోగ్య రహస్యాలే వేరు. కానీ చాలా మంది ఇంటి ఫుడ్ కంటే.. బయట ఫుడ్ కే మక్కువ చూపిస్తారు. కొందరికి ఈ విషయం తెలియక పొరపాట్లు చేస్తే.. కొందరు తెలిసి కూడా లేనిపోని అనారోగ్యాల బారిన పడుతుంటారు. ఉదాహరణకు పీసీఓడీ. 80 శాతం మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇందుకు నువ్వులు చక్కటి పరిష్కారం. రోజూ నువ్వులు తింటే..

Sesame Home Remedies: రోజూ ఒక్క స్ఫూన్ నువ్వులు తింటే.. ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే మైండ్ బ్లాకే!!
Sesame
Follow us on

మనం ఎదుర్కొనే అనారోగ్యాలకు 90 శాతం పరిష్కారం మనం తినే ఆహారంలోనే ఉంటుంది. అందులోనూ ఇంటి ఫుడ్ ల ఉండే ఆరోగ్య రహస్యాలే వేరు. కానీ చాలా మంది ఇంటి ఫుడ్ కంటే.. బయట ఫుడ్ కే మక్కువ చూపిస్తారు. కొందరికి ఈ విషయం తెలియక పొరపాట్లు చేస్తే.. కొందరు తెలిసి కూడా లేనిపోని అనారోగ్యాల బారిన పడుతుంటారు. ఉదాహరణకు పీసీఓడీ. 80 శాతం మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇందుకు నువ్వులు చక్కటి పరిష్కారం. రోజూ నువ్వులు తింటే.. పీసీఓడీ సమస్య తగ్గడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

-నువ్వుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అంటే 10 గ్రాముల నువ్వుల్లో 4 శాతం ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే ఊబకాయం, టైప్ 2 షుగర్ రాకుండా నియంత్రిస్తుంది.

-రోజూ క్రమం తప్పకుండా ఒక స్పూన్ నువ్వులు తింటే.. గుండె జబ్బులకు కారణమయ్యే అధిక కొలెస్ట్రాల్త, ట్రై గ్లిజరైడ్ లు తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

-నువ్వుల్లో 15 శాతం సాచురేటెడ్, 41 శాతం పాలీ అన్ శాచురేటెడ్, 39 శాతం మోనో శాచురేటెడ్ కొవ్వులు కలిగి ఉంటాయి. మోనో శాచురేటెడ్ కొవ్వులు.. గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

-వేయించిన నువ్వులు తింటే.. వాటిలో ఉండే ఆక్సలేట్, ఫైటేట్ లు జీర్ణక్రియ, ప్రొటీన్ అబార్షన్ ఆటంకాలను తగ్గిస్తాయి.

-నువ్వుల్లో జంతువుల్లో ఉండే అమినో ఆసిడ్ కూడా దొరుకుతుంది. శాకాహారులకు ఇది మంచి ఆహారం.

-నువ్వులలో ఉండే లిగ్నాన్స్, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు రక్త ప్రవాహానికి సహాయపడుతాయి. వీటిలో ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గిస్తుంది.

-ఎముకల పెరుగుదలకు నువ్వులు మంచి ఆహారంగా ఉంటాయి. పొట్టు తీయని నువ్వుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది.

-రోజూ ఒక స్పూన్ నువ్వులు తినడం అలవాటు చేసుకుంటే.. బరువు తగ్గి.. శరీరం బిగుస్తుంది. అలాగే నడుం నొప్పి, రుతుక్రమం సమయంలో కడుపునొప్పి రాకుండా ఉంటాయి.

-నువ్వులు తింటే థైరాయిడ్ కూడా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. వీటిలో ఉంటే సెలీనియం థైరాయిడ్ హార్మోన్లను బ్యాలెన్స్ డ్ ఉంచడంలో సహాయపడుతుంది. అందుకు అవసరమైన ఐరన్, విటమిన్ బి6 లను నువ్వులు సరఫరా చేస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి