Myopia In Children: మీ పిల్లల కళ్లను సంరక్షించే యాప్స్‌ ఇవే.. వెంటనే ఇన్‌స్టాల్‌ చేయండి..

ముఖ్యంగా డిజిటలైజేషన్లో భాగంగా పిల్లలు కూడా ఫోన్లకు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌ లకు అలవాటు పడటంతో వారి కళ్లు చిన్న వయసులోనే దెబ్బతింటున్నాయి. ఎక్కువమంది మయోపియాతోనే బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. మయోపియా అంటే హ్రస్వదృష్టి. అంటే వీరు దగ్గర ఉన్న వస్తువులను చూడగలరు కానీ దూరపు వస్తువులను చూడలేరు.

Myopia In Children: మీ పిల్లల కళ్లను సంరక్షించే యాప్స్‌ ఇవే.. వెంటనే ఇన్‌స్టాల్‌ చేయండి..
child eye care

Updated on: Jul 26, 2023 | 1:00 PM

శరీరంలోని ఇంద్రియాలలో నేత్రాలు ప్రధానమైనవి. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అయితే ఇటీవల కాలంలో కంటి సమస్యలు చిన్న పిల్లల్లోనూ అధికమవుతున్నాయి. ఒకప్పుడు, మధ్య వయస్కుల్లోనూ, వృద్ధుల్లోనే కనిపించే దృష్టి లోపాలు ఇప్పుడు చిన్నారుల్లో కనిపిస్తున్నాయి. స్కూలుకెళ్లే పిల్లలు కూడా కళ్లజోళ్లతో కనిపిస్తున్నారు. ముఖ్యంగా డిజిటలైజేషన్లో భాగంగా పిల్లలు కూడా ఫోన్లకు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌ లకు అలవాటు పడటంతో వారి కళ్లు చిన్న వయసులోనే దెబ్బతింటున్నాయి. ఎక్కువమంది మయోపియాతోనే బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. మయోపియా అంటే హ్రస్వదృష్టి. అంటే వీరు దగ్గర ఉన్న వస్తువులను చూడగలరు కానీ దూరపు వస్తువులను చూడలేరు. బ్లర్‌గా కనిపిస్తాయి. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం 2050 నాటికి మొత్తం ప్రపంచ జనాభాలో సగం మంది ఈ మయోపియా బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. ఇది రావడానికి ‍ప్రధాన కారణాలు జెనెటిక అలాగే వాతావరణ పరిస్థితులను బట్టి కూడా ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి కండిషన్ ఉన్నవారిలో కనుగుడ్డు ఉండాల్సిన దానికంటే పొడవుగా ఉంటుంది. దాంతో సరిగ్గా రెటీనా మీద కేంద్రీకృతం (ఫోకస్) కావాల్సిన కాంతికిరణాలు.. రెటీనాకు కాస్త ముందే కేంద్రీకృతమవుతాయి. దాంతో దగ్గరి వస్తువులు మాత్రమే స్పష్టంగా కనిపించినా.. దూరాన ఉన్న వస్తువులు మాత్రం స్పష్టంగా కనిపించవు. ఇటీవల కాలంలో ఇది స్కూల్‌కి వెళ్తున్న పిల్లల్లోనూ వ్యాపిస్తున్నట్లు గుర్తించారు.

కంటి ఆరోగ్యాన్ని సంరక్షించే యాప్స్..

కంటి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వైద్య నిపుణుడిని సంప్రదించే ముందు కొన్ని యాప్స్‌ ద్వారా కంటి ఆరోగ్యాన్ని పరీక్షించుకోవచ్చు. అవి గూగుల్ ప్లే స్టోర్‌ లోనే మనకు దొరకుతాయి. వాటిని వినియోగించుకొని కంటి దృష్టిని మెరుగుపరచుకోవచ్చు. ఆయా యాప్స్‌లో కొన్ని టిప్స్‌ తో పాటు కంటి వ్యాయామాలు ఉంటాయి. వాటిలో కొన్ని యాప్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఐ ఎక్సర్‌సైజెస్‌.. ఈ యాప్‌ విభిన్న రకాలైన కంటి వ్యాయామాలు అందిస్తుంది. వాటిలో బ్లింక్‌ ఎక్సర్‌సైజ్‌, ఆబ్జెక్ట్‌ ట్రాకింగ్‌, స్కేలింగ్‌ ఆబ్జెక్ట్‌, పామ్‌ ఎక్సర్‌సైజ్‌ వంటివి ఉంటాయి. ఈ ఐ కేర్‌ యాప్‌ ద్వారా పొడిబారిన కళ్లు, లేజీ ఐస్‌ వంటి వాటిని పరిష్కరించవచ్చు.

ఇవి కూడా చదవండి

విజన్‌అప్‌.. ఈయాప్‌ లో కంటి సంబంధించిన యోగా వ్యాయామాలు ఉంటాయి. ఇందులో డిజైన్‌ చేసిన వ్యాయామాలు కంటి చుట్టూ ఉండే కండరాలు బలపడటానికి, ఫ్లెక్సిబుల అవడానికి సాయపడతాయి. ఈ వ్యాయామాలు ఐ కోఆర్డినేషన్‌, ఐ ట్రాకింగ్‌, ఐ ఫోకసింగ్‌ వంటి మెరుగుపరచడమే కాకుండా ఓవరాల్‌గా కనుదృష్టిని పెంచుతుంది.

ఐఎస్‌ఎక్స్‌.. ఈ యాప్‌లో మీ కంటి అవసరాలకు అనుగునంగా వ్యాయామాలు ఉంటాయి. మీరు గేమింగ్‌ ఎక్కువ ఆడేవారు అయితే దానికి సంబంధించిన కంటి వ్యాయామాలుంటాయి. విద్యార్థి అయితే వారికి తగిన వ్యాయామాలు ఉంటాయి. అలాగే నేత్రాల ఆరోగ్యానికి అవసరమైన చిట్కాలను కూడా ఇది అందిస్తుంది.

విజన్‌ టెస్ట్స్‌.. ఇది ఫ్రీ యాప్‌. కనుదృష్టిను తనిఖీ చేసుకోవడంతో పాటు దృష్టి సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది. దీనిని చాలా సులువుగా వినియోగించుకోవచ్చు. పిల్లల కంటి ఆరోగ్యాన్ని ‍పరిరక్షించడంలో ఇవి బాగా ఉపయోగపడతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..