వామ్మో.. రాత్రిపూట లైట్లు వేసుకుని నిద్రపోతున్నారా..? ఈ విషయం తెలిస్తే చెమటలు పట్టాల్సిందే..

|

Jan 26, 2023 | 1:00 PM

ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో కనీసం 7-8 గంటల నిద్ర అవసరం. చాలామంది అనారోగ్యం బారిన పడటానికి కారణం సరైన నిద్ర లేకపోవడమే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.

వామ్మో.. రాత్రిపూట లైట్లు వేసుకుని నిద్రపోతున్నారా..? ఈ విషయం తెలిస్తే చెమటలు పట్టాల్సిందే..
Sleeping
Follow us on

ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో కనీసం 7-8 గంటల నిద్ర అవసరం. చాలామంది అనారోగ్యం బారిన పడటానికి కారణం సరైన నిద్ర లేకపోవడమే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదంతా ఒకటైతే.. కొంతమంది లైట్లు వేసుకోని నిద్రపోతుంటారు. మీకూ రాత్రిపూట లైట్ వేసుకుని నిద్రించే అలవాటు ఉంటే వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అలా చేయడం వలన ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కుగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. క్రమంగా ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలు వస్తాయని.. శరీరానికి అనేక రకాలుగా నష్టం వాటిల్లుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక రాత్రి కూడా సాధారణ వెలుతురులో నిద్రపోతే గ్లూకోజ్, కార్డియోవాస్కులర్ రెగ్యులేషన్‌లో భంగం కలుగుతుందని ఫిన్‌బెర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వైద్యులు పరిశోధనలో కనుగొన్నారు. గుండె సమస్యలకు, మధుమేహం, ఇతర జీవక్రియ సిండ్రోమ్‌లకు సంబంధించిన వ్యాధులకు ఇది కారణంగా మారవచ్చని పేర్కొంటున్నారు.

  1. గుండె జబ్బుల ప్రమాదం: కృత్రిమ కాంతి శరీరంపై ప్రభావంతోపాటు.. రోగనిరోధక నాడీ వ్యవస్థను సక్రియం చేస్తుందని అధ్యయనాలు కనుగొన్నాయి. ఈ రెండూ శరీరంలోని బాహ్య దూకుడుతో పోరాడటానికి బాధ్యత వహిస్తాయి. నిద్ర వస్తున్నా.. కాంతి చురుకుగా మారేందుకు కారణం అవుతుందని.. దీనివల్ల నిద్ర ప్రభావితమవుతుంది. ఇది కార్డియోవాస్కులర్ పనితీరుపై ప్రభావం చూపుతుంది. అధ్యయనం ప్రకారం.. వీటన్నింటి ఫలితంగా శరీరంలో దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతుందని తేలింది. కాంతి ప్రభావం వల్ల స్కార్డియన్ రిథమ్ క్షీణించి, శరీరంలోని మాస్టర్ క్లాక్ చెడిపోతుంది. ఇంకా ఇది రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
  2. ఊబకాయం: మహిళలపై జరిపిన పరిశోధనలో లైట్లు ఆర్పేసి నిద్రించే వారి కంటే టీవీ లేదా లైట్లు వేసుకుని పడుకునేవారిలో ఊబకాయం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది.
  3. మధుమేహం: రాత్రిపూట లైట్లు వెలిగించి నిద్రించే వ్యక్తులు ఉదయం పరీక్షించినప్పుడు ఇన్సులిన్ పెరిగిందని పరిశోధకులు కనుగొన్నారు. కండరాలు, కడుపు, కాలేయం ఇన్సులిన్‌కు సరిగ్గా స్పందించని పరిస్థితిని ఇన్సులిన్ నిరోధకత అంటారు. శరీరానికి శక్తి, రక్తంలో గ్లూకోజ్ వినియోగం తగ్గుతుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ తయారు చేయాలి. దీని కారణంగా, రక్తంలో చక్కెర స్థాయి కాలక్రమేణా పెరుగుతుంది.
  4. డిప్రెషన్: అధ్యయనం ప్రకారం రాత్రిపూట లైట్లు వెలిగించి నిద్రపోవడం వల్ల డిప్రెషన్ వచ్చే ప్రమాదం ఉంది. ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వెలువడే నీలి కాంతి మీ మానసిక స్థితిపై చెత్త ప్రభావాన్ని చూపుతుంది. రాత్రి వేళ నిద్ర లేకపోవడంతో మానసిక ఆందోళనతోపాటు చిరాకు కలిగిస్తుంది.
  5. ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం..