బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే మీ పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం ఖాయమంటున్న ఎక్స్‌పర్ట్స్

ఆధునిక జీవనశైలిలో చాలా మంది సమయం లేకనో లేదా బరువు తగ్గాలనే ఉద్దేశంతోనో చేసే మొదటి పని అల్పాహారాన్ని స్కిప్ చేయడం. కానీ, ఈ అలవాటు ఆరోగ్యానికి మేలు చేయడం కంటే ఎక్కువ కీడు చేస్తుందని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు.

బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే మీ పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం ఖాయమంటున్న ఎక్స్‌పర్ట్స్
Skipping Breakfast.jpg

Updated on: Feb 26, 2026 | 6:20 AM

అల్పాహారం మానేయడం వల్ల శరీరంలో జరిగే మార్పులు, అది పొట్ట దగ్గర కొవ్వు పెరగడానికి ఎలా కారణమవుతుందో తెలుసుకుందాం.. ఉదయాన్నే లేవగానే ఆఫీస్ పనుల కంగారులోనో లేదా డైటింగ్ పేరుతోనో మీరు అల్పాహారాన్ని పక్కన పెడుతున్నారా? అయితే మీరు తెలియకుండానే ఒక పెద్ద ఆరోగ్య సమస్యను కొనితెచ్చుకుంటున్నారు. బరువు తగ్గాలని అల్పాహారం మానేస్తే, అది రివర్స్ అయి మీ పొట్ట చుట్టూ కొవ్వు పెరగడానికి కారణం అవుతుందని ప్రముఖ పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రాజ్ షమానీ పాడ్‌కాస్ట్‌లో ఒక నిపుణురాలు వెల్లడించిన గణాంకాలు ఇప్పుడు అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి.

నిపుణుల హెచ్చరిక..

ప్రముఖ న్యూట్రిషనిస్ట్ పూజా మఖిజా ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ అల్పాహారం మానేసే వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఎవరైతే క్రమం తప్పకుండా బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తారో, అటువంటి వారిలో పొట్ట దగ్గర కొవ్వు పెరిగే అవకాశం 31 శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, అల్పాహారం తినని వారు సాధారణ వ్యక్తుల కంటే 48 శాతం ఎక్కువగా ఓవర్ వెయిట్ అయ్యే ప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా, వీరిలో స్థూలకాయం బారిన పడే అవకాశం 44 శాతం ఎక్కువగా ఉంటుందని ఆమె గణాంకాలతో వివరించారు.

అల్పాహారం తీసుకోకపోవడం వల్ల శరీరానికి అందాల్సిన శక్తి అందదు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి, మెదడు వెంటనే శక్తిని ఇచ్చే తీపి పదార్థాలను కోరుకుంటుంది. ఫలితంగా అల్పాహారం మానేసిన వారు లంచ్ సమయంలో లేదా సాయంత్రం వేళల్లో జంక్ ఫుడ్, స్వీట్లు ఎక్కువగా తీసుకుంటారు. ఇదే క్రమంగా శరీర బరువు పెరగడానికి, పొట్ట దగ్గర అదనపు కొవ్వు చేరడానికి దారితీస్తుందని పూజా మఖిజా పేర్కొన్నారు.

ఈ అంశంపై థానేలోని కిమ్స్ హాస్పిటల్స్ డయాబెటాలజీ విభాగం హెడ్ డాక్టర్ విజయ్ నెగలూర్ స్పందిస్తూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. అల్పాహారం మానేయడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు పెరుగుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అయితే, అల్పాహారం మానేయడమే నేరుగా దీనికి కారణం కాకపోవచ్చని, కానీ ఇది జీవక్రియపై ప్రభావం చూపిస్తుందని ఆయన వివరించారు. అల్పాహారం మానేసే వారి జీవనశైలిలో ఉండే ఇతర అస్తవ్యస్త అలవాట్లు కూడా స్థూలకాయానికి తోడవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆరోగ్యకరమైన ఉదయం కోసం సమతుల్యమైన అల్పాహారం తీసుకోవడం ఎంతో అవసరం. కేవలం బరువు తగ్గడం కోసం బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. కాబట్టి రేపటి నుండి మీ డైట్ లో పోషకాలు నిండిన అల్పాహారాన్ని చేర్చుకోండి.

Follow Us