ముక్కు దిబ్బడను నిర్లక్ష్యం చేయకండి.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

ముక్కు ఎప్పుడూ మూసుకుపోవడం, కళ్ల చుట్టూ లేదా ముఖంలో నొప్పి.. ఈ లక్షణాలు చాలా మందిలో కనిపిస్తాయి. చాలా మంది వీటిని చిన్న సమస్యగా కొట్టిపారేస్తారు. కానీ వైద్య నిపుణుల ప్రకారం వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. కొన్నిసార్లు ఇవి సైనస్ ప్రాంతాల్లో ఏర్పడే ట్యూమర్స్ సంకేతాలు కావచ్చు.

ముక్కు దిబ్బడను నిర్లక్ష్యం చేయకండి.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?
Nasal Block With Headache

Updated on: Jul 14, 2025 | 8:25 PM

మీకు ముక్కు ఎప్పుడూ మూసుకుపోవడం, ముఖంలో నొప్పి, తలనొప్పులు లాంటి సమస్యలు వెంటాడుతూ ఉంటే.. అవి మామూలు సైనస్ ఇన్ఫెక్షన్ కాకుండా తీవ్రమైన పరిస్థితికి సైన్ కావచ్చు. ముఖ్యంగా ఈ లక్షణాలు సైనస్‌ ల చుట్టూ పెరుగుతున్న కణితుల వల్ల వస్తున్నాయేమో అని పరీక్షించుకోవడం బెస్ట్.

సైనస్‌ లో ట్యూమర్స్

పారానాసల్ సైనస్‌ లు (Paranasal Sinuses) అనేవి ముక్కు చుట్టూ ఉండే గాలితో నిండిన ఖాళీ ప్రదేశాలు. ఇవి శ్వాస ప్రక్రియలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ ప్రదేశాల్లో గడ్డలు, ట్యూమర్స్ ఏర్పడితే అవి శ్వాసలో ఇబ్బందిని క్రియేట్ చేస్తాయి. మామూలు మందులు కూడా పనిచేయకుండా పోవచ్చు. ముక్కు, సైనస్ భాగంలో వచ్చే ముఖ్యమైన ట్యూమర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నాసల్ ట్యూమర్స్

మామూలుగా ఉండేవి (Benign)

  • నాసల్ పాలిప్స్ (Nasal polyps).. ఇవి ముక్కు లోపల పెరిగే చిన్నచిన్న మాంసం ముద్దలు.
  • హేమాంగియోమా (Hemangioma).. రక్తనాళాలతో కూడిన కణితులు.
  • ఇన్వర్టెడ్ పాపిల్లోమా (Inverted papilloma).. ఇవి కూడా పెరుగుతాయి కానీ క్యాన్సర్ కాదు.

క్యాన్సర్ కణితులు (Malignant Tumors)

  • స్క్వామస్ సెల్ కార్సినోమా (Squamous cell carcinoma).. ఇది చాలా కామన్ గా వచ్చే ముక్కు క్యాన్సర్.
  • అడెనోకార్సినోమా (Adenocarcinoma).. గ్రంధుల నుంచి వచ్చే క్యాన్సర్.
  • న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ (Neuroendocrine Tumors).. ఇవి నాడీ కణాల నుంచి వచ్చేవి.

పారా నాసల్ సైనస్ ట్యూమర్స్

మామూలుగా ఉండేవి (Benign)

  • ఇన్వర్టెడ్ పాపిల్లోమా (Inverted papilloma).. సైనస్‌లలో కూడా ఇవి ఉండొచ్చు.
  • ఆస్టియోమా (Osteoma).. ఎముక లాంటి గట్టి కణితులు.

క్యాన్సర్ కణితులు (Malignant)

  • స్క్వామస్ సెల్ కార్సినోమా (Squamous cell carcinoma).. సైనస్‌లలో కూడా ఇది కామన్.
  • అడెనోకార్సినోమా (Adenocarcinoma).. గ్రంధుల నుంచి వచ్చే క్యాన్సర్.
  • మెలనోమా (Melanoma).. చర్మ క్యాన్సర్ లాంటిది, ఇది సైనస్‌లలో అరుదుగా వస్తుంది.
  • లింఫోమా (Lymphoma).. లింఫ్ నోడ్స్‌ కు సంబంధించిన క్యాన్సర్.

ట్రైజెమినల్ న్యూరాల్జియా (Trigeminal Neuralgia)

నరాలకు సంబంధించిన నొప్పులు.. ట్రైజెమినల్ న్యూరాల్జియా (Trigeminal Neuralgia) అనే కండిషన్ వల్ల ముఖంలో ఒక్కసారిగా తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇది కణితులు నరాలపై ఒత్తిడి కలిగించడం వల్ల వస్తుంది.

నాసోఫారింజియల్ క్యాన్సర్ (Nasopharyngeal Cancer)

ఇది ముక్కు వెనుక, గొంతు పై భాగంలో వచ్చే ఒక రకం క్యాన్సర్. ముక్కు దిబ్బడ, రక్తం కారడం వంటి లక్షణాలతో ఇది సైనసైటిస్ లాగే అనిపించొచ్చు.

ఓరోఫారింజియల్ క్యాన్సర్ (Oropharyngeal cancer)

ముఖ్యంగా గొంతులో కనిపించే ఈ క్యాన్సర్.. కొన్నిసార్లు ముక్కు పట్టేయడం, ముఖంలో నొప్పి వంటి సైనస్ సింప్టమ్స్‌ తో కూడా రావచ్చు.

అరుదైనవి.. కానీ ముఖ్యమైన ట్యూమర్స్

  • ఆల్ఫాక్టరీ న్యూరోబ్లాస్టోమా (Olfactory Neuroblastoma)
  • వెస్టిబ్యులర్ ష్వాన్నోమా (Vestibular Schwannoma)
  • పారా నాసల్ సైనస్‌ లలో లాలాజల గ్రంధి క్యాన్సర్లు (Salivary Gland Cancers in Paranasal Sinuses)
  • ప్లాస్మాసైటోమా (Plasmacytoma)
  • సార్కోమా రకాలు (Types of Sarcoma)
  • మెదడులో వచ్చే ఇంట్రాక్రానియల్ ట్యూమర్స్ (ముఖంలో నొప్పికి కారణం కావచ్చు) Intracranial Tumors in the Brain

అన్ని దీర్ఘకాలిక సైనస్ లక్షణాలు కణితులే అని చెప్పలేం కానీ.. మామూలు చికిత్సలకు తగ్గని సమస్యలను మాత్రం లైట్ తీసుకోకూడదు. సరైన సమయంలో గుర్తించగలిగితే.. కరెక్ట్ ట్రీట్‌మెంట్‌ తో ప్రాణాలను కాపాడవచ్చు.

ప్రస్తుత రోజుల్లో అడ్వాన్స్‌డ్ మెడికల్ టెక్నాలజీ, లేటెస్ట్ ఇమేజింగ్ పద్ధతులు ద్వారా ట్రీట్‌మెంట్ మరింత ఖచ్చితంగా జరుగుతోంది. ENT స్పెషలిస్టుల సాయంతో పాటు.. అవసరమైనప్పుడు క్యాన్సర్ స్పెషలిస్టులను కలవడం వల్ల సరైన డైరెక్షన్‌ లో ముందుకు వెళ్లొచ్చు.

చెవి, ముక్కు, గొంతు (ENT) సంబంధమైన సమస్యలను చిన్నవిగా చూడటం మానేయండి. ముక్కు దిబ్బడ, ముఖంలో నొప్పి లాంటి లక్షణాలు కంటిన్యూ అవుతుంటే వెంటనే నిపుణుల సలహా తీసుకోవడం బెస్ట్.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..