
అదే ‘ప్రోటీన్’. దీనిని శాస్త్రీయంగా ‘శరీర నిర్మాణ దారువు’ అని పిలుస్తారు. అంటే మన ఇల్లు కట్టడానికి ఇటుకలు ఎంత అవసరమో, మన బాడీ బిల్డ్ అవ్వడానికి ప్రోటీన్ అంత అవసరం. అయితే దురదృష్టవశాత్తూ మనలో చాలామంది కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్స్ ఉన్న ఆహారానికి ఇచ్చే ప్రాధాన్యతను ప్రోటీన్ కు ఇవ్వరు. ఆహారంలో దీని పరిమాణం తగ్గితే కేవలం కండరాలు మాత్రమే కాదు.. మీ రోగనిరోధక శక్తి, మానసిక స్థితి, చివరకు మీ అందం కూడా దెబ్బతింటుంది. మీ బాడీలో ప్రోటీన్ తక్కువగా ఉంటే శరీరం కొన్ని రహస్య సంకేతాలను పంపిస్తుంది. అవేంటో తెలిస్తే మీరు వెంటనే మీ డైట్ మార్చుకుంటారు.
శరీరానికి బయట నుంచి ప్రోటీన్ అందనప్పుడు, అది మన కండరాల్లో దాగి ఉన్న ప్రోటీన్‌ను వాడటం ప్రారంభిస్తుంది. దీనివల్ల కండరాలు బలహీనపడతాయి. ముఖ్యంగా వయసు పెరుగుతున్న వారు ప్రోటీన్ సరిగ్గా తీసుకోకపోతే నడకలో పటుత్వం తగ్గుతుంది, త్వరగా అలసిపోతుంటారు.
సాధారణ ఆరోగ్యవంతుడైన వ్యక్తికి తన శరీర బరువులో ప్రతి కిలోకు 0.8 గ్రాముల నుంచి 1 గ్రాము వరకు ప్రోటీన్ అవసరం. ఉదాహరణకు మీరు 60 కిలోల బరువు ఉంటే, మీకు రోజుకు కనీసం 48 నుండి 60 గ్రాముల ప్రోటీన్ కావాలి. గర్భిణీలు, క్రీడాకారులు, వ్యాయామం చేసేవారు ఇంకా ఎక్కువ మొత్తంలో తీసుకోవాల్సి ఉంటుంది. శాకాహారులు తమ ఆహారంలో పప్పుధాన్యాలు, పనీర్, సోయా, బాదం, వాల్‌నట్స్ వంటి నట్స్ ను భాగం చేసుకోవాలి.
అలాగే చియా సీడ్స్, గుమ్మడి గింజలు, పాలు, పెరుగు తీసుకోవడం ద్వారా కూడా ప్రోటీన్ లోపాన్ని అధిగమించవచ్చు. ఇవి సహజంగా మనకు శక్తిని ఇచ్చి శరీరాన్ని దృఢంగా ఉంచుతాయి. ఆరోగ్యం అనేది మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ప్రోటీన్ లోపాన్ని కేవలం ఒక సమస్యగా కాకుండా శరీరానికి కావలసిన మౌలిక వసతిగా గుర్తించాలి. ఈ రోజు నుంచే మీ భోజనంలో ప్రోటీన్ ఉండేలా ప్లాన్ చేసుకోండి.