Gond Katira: గోండ్ కటిరా తినే అలవాటుందా..? వామ్మో.. ముందు ఈ విషయాలు తెలుసుకోండి..

Gond Katira Side Effects: ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో చాలామంది ఆరోగ్యంపై దృష్టిపెడుతున్నారు. అందుకోసం ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో గోండ్ కటిరా తినడం ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తున్నారు.

Gond Katira: గోండ్ కటిరా తినే అలవాటుందా..? వామ్మో.. ముందు ఈ విషయాలు తెలుసుకోండి..
Gond Katira Side Effects

Updated on: Dec 16, 2023 | 4:42 PM

Gond Katira Side Effects: ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో చాలామంది ఆరోగ్యంపై దృష్టిపెడుతున్నారు. అందుకోసం ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో గోండ్ కటిరా తినడం ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తున్నారు. గోండ్ కటిరాలో ప్రోటీన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఇందులో ఉంటాయి. ఎండాకాలంలోనే కాకుండా చలికాలంలోనూ గోండు కటిర లడ్డూలు తింటారు కొందరు. ఇవి తినడానికి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అయితే, గోండ్ కటిరా శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కొంతమంది తమ ఆహారంలో ఇది అవసరమని భావిస్తారు. దీన్ని షేక్స్, స్మూతీస్, పాలలో కలుపుకుని తింటారు.

అయితే, ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పే గోండు కటిరా వల్ల కూడా హాని కలుగుతుందన్న విషయం మీకు తెలుసా..? తెలియకపోతే ఈ విషయాలు తెలుసుకోండి.. కొన్ని సందర్భాల్లో గోండు కటిరా తీసుకోవడం వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు వ్యక్తులు గమ్ కటిరా తినడం వల్ల అలెర్జీ లాంటి సమస్యలను అనుభవించవచ్చు. ఇది కాకుండా, అనేక ఇతర మార్గాల్లో కూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.. అవేంటో తెలుసుకోండి..

కడుపు సమస్యలు: గోండ్ కటిరా అంత తేలికగా జీర్ణం కాదని పోషకాహార నిపుణులు అంటున్నారు. నిజానికి, ఇది చాలా జిగటగా ఉంటుంది. అజీర్ణం, గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు గోండు కటిరా తినకూడదు. ఇది మీ ప్రేగులు, సిరలలో ఉంటుంది, దీని కారణంగా జీర్ణవ్యవస్థ ప్రభావితమవుతుంది.

అలర్జీలు: గమ్ కటిరాకు అలెర్జీ కేసులు లేనప్పటికీ, కొంతమందిలో దీనిని తిన్న తర్వాత అలెర్జీ లాంటి ప్రతిచర్యలు కనిపిస్తాయి. దీని వల్ల చర్మంపై దద్దుర్లు, దురదలు, మంట వంటి సమస్యలు కనిపిస్తాయి. మీకు ఏదైనా రకమైన అలెర్జీ ఉన్నట్లయితే డాక్టర్ సలహా లేకుండా గోండ్ కటిరా తినవద్దు.

గర్భధారణ సమయంలో: గర్భిణీ స్త్రీలు డాక్టరు సలహా లేకుండా Gond Katira ను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ఇది గర్భధారణ సమయంలో సంక్లిష్టతలను పెంచుతుంది. గర్భిణీ స్త్రీలు గోండ్ కటిరా గురించి తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. ఇది కాకుండా, గోండ్ కటిరా తిన్న తర్వాత మహిళలు వికారంతో బాధపడవచ్చు. కొన్ని సందర్భాల్లో వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు లాంటివి కనిపిస్తాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..