Pain Relief Remedies: ఏసీ గదుల్లో వర్క్ చేసేవారిలో తప్పని మెడ, భుజాల నొప్పుల తిప్పలు! ఇలా ఉపశమనం పొందండి

|

Sep 15, 2024 | 1:02 PM

చాలా మంది ఆఫీసుల్లో ఎయిర్ కండిషన్డ్ గదుల్లో కూర్చొని, గంటల తరబడి ల్యాప్‌టాప్‌లో పని చేస్తూ ఉంటారు. కంప్యూట‌ర్ ముందు కంటిన్యూగా ప‌నిచేస్తే భుజాలలో విపరీతమైన నొప్పి మొదలవుతుంది. అంతేకాకుండా ఫోన్ బ్లూటూత్, బైక్ రైడింగ్ వంటి వాటి వల్ల ఉద్యోగం నరకప్రాయం అవుతుంది...

Pain Relief Remedies: ఏసీ గదుల్లో వర్క్ చేసేవారిలో తప్పని మెడ, భుజాల నొప్పుల తిప్పలు! ఇలా ఉపశమనం పొందండి
Pain Relief Remedies
Follow us on

చాలా మంది ఆఫీసుల్లో ఎయిర్ కండిషన్డ్ గదుల్లో కూర్చొని, గంటల తరబడి ల్యాప్‌టాప్‌లో పని చేస్తూ ఉంటారు. కంప్యూట‌ర్ ముందు కంటిన్యూగా ప‌నిచేస్తే భుజాలలో విపరీతమైన నొప్పి మొదలవుతుంది. అంతేకాకుండా ఫోన్ బ్లూటూత్, బైక్ రైడింగ్ వంటి వాటి వల్ల ఉద్యోగం నరకప్రాయం అవుతుంది. నిత్యం ల్యాప్‌టాప్‌లు, ఫోన్‌లలో నిమగ్నమై ఉండటం వల్ల శరీరం పైభాగంలోని కండరాలపై ఒత్తిడి పడుతుంది. సరైన పొజిషన్‌లో కాకుండా తప్పుడు కూర్చునే భంగిమ, పని చేసే భంగిమ కారణంగా కూడా మెడ నొప్పి పెరుగుతుంది. దీర్ఘకాలంగా భరించలేని మెడ, భుజాల నొప్పితో బాధపడితే స్పాండిలైటిస్ సమస్య పెరుగుతుంది. ఈ నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి?

  • ఆఫీసులో కుర్చీలో కూర్చొని పని చేసేవారు లేదా ఇంటిలో కుర్చీలో కూర్చుని పని చేసినా.. ఎల్లప్పుడూ నేరుగా కూర్చోవడం మర్చిపోకూడదు. మీరు ఈ కుర్చీపై నిటారుగా కూర్చోవాలి. మీ వీపును స్ట్రైట్‌గా ఉంచడానికి ప్రయత్నించండి. ఇలా కుర్చిలో కూర్చుని కూడా తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. కుర్చీలో నిటారుగా కూర్చుని రెండు చేతులను నేరుగా తలపైకి ఎత్తాలి. అప్పుడు నెమ్మదిగా ముందుకు, వెనుకకు వంగడానికి ప్రయత్నించాలి. ఈ వ్యాయామం 4-5 సార్లు చేస్తే మెడ నొప్పి రాదు.
  • మెడ, భుజం నొప్పి ప్రారంభమైనప్పుడు ఐస్ థెరపీ సహాయపడుతుంది. ఇది కండరాల నొప్పిని తగ్గిస్తుంది. విశ్రాంతిని అందిస్తుంది. ఒక టవల్ లేదా రుమాలులో కొన్ని ఐస్‌ ముక్కలను చుట్టాలి. వీటిని 10-20 నిమిషాలు నొప్పి ఉన్న ప్రదేశంలో ఉంచాలి. ఇది అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.
  • చల్లగా కాకుండా వేడిగా ఉండే పదార్ధాలతో కూడా ఉపశమనం పొందవచ్చు. వేడి నీళ్లలో టవల్ తడిపి మెడపై వత్తాలి. 10 నిమిషాల పాలు ఇలా చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
  • భుజం, మెడ నొప్పిని తగ్గించడానికి వ్యాయామం సహాయం కూడా తీసుకోవచ్చు. నేలమీద పడుకుని, ఒక కాలు నిఠారుగా ఉంచి, మరో కాలును మోకాలి వరకు వంచాలి. ఇప్పుడు ఓ వైపుకు తిప్పి ఒక చేతిని మడిచి, మరో చేతిని మెల్లగా తల కింద ఉంచాలి. రోజుకు 5 సార్లు కోసం ఈ వ్యాయామాన్ని పునరావృతం చేయాలి. ఇది మెడ, భుజాల నొప్పిని తగ్గిస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.