Sapota Benefits
Sapota health benefits: సపోటా చూడటానికి చిన్నగా కనిపిస్తుంది. కానీ దీనిలో అనేక ఔషధ గుణాలు దాగున్నాయి. రోజూ సపోటా పండు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని పేర్కొంటున్నారు. ఈ పండులో యాంటీఆక్సిడెంట్లు, అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ససోట గింజల నుంచి బెరడు వరకు అన్ని కూడా పలు సమస్యలను దూరం చేసేందుకు ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
సపోటా పండు ప్రయోజనాలు..
- జ్వరం నయం అవుతుంది: సపోట బెరడు ఉడకబెట్టి కషాయం చేసి తాగితే జ్వరం తగ్గుతుంది. అధిక జ్వరాన్ని తగ్గించడంలో సపోటా డికాషన్ సహాయపడుతుంది. జ్వరాన్ని తగ్గించడానికి 5-10 ml వరకు కషాయాన్ని తయారు చేసి తాగవచ్చు.
- నొప్పి – వాపు నుంచి ఉపశమనం: సపోట నొప్పి, వాపు సమస్యను కూడా తొలగిస్తుంది. సపోట గుజ్జును నొప్పి ఉన్న చోట రాస్తే నొప్పి తగ్గుతుంది. దీంతోపాటు ఇది వాపును కూడా నివారిస్తుంది.
- జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: సపోటలో జీర్ణక్రియకు ఉపయోగపడే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. సపోట జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. మలబద్ధకం, అజీర్ణం సమస్యను నివారిస్తుంది. లూజ్ మోషన్ నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
- బరువు తగ్గొచ్చు: సపోట జీవక్రియను మెరుగుపరిచి.. బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. అధిక క్యాలరీలు ఉన్న పండ్లకు బదులుగా సపోటా షేక్ లేదా సపోట ఫ్రూట్ రోజూ తినడం మంచిది. దీంతో బరువు తగ్గొచ్చు.
- కంటి చూపు మెరుగుపడుతుంది: సపోటా పండులో విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. కంటికి మేలు చేసే ‘విటమిన్ ఎ’ సపోటాలో పుష్కలంగా లభిస్తుంది.
- బలహీనతను తొలగిస్తుంది: సపోటలో బలహీనతను దూరం చేసే అనేక పోషకాలు ఉన్నాయి. మీరు సన్నగా, బలహీనంగా ఉన్నట్లయితే ప్రతిరోజూ దీనిని తినాలి. వైద్యులు కూడా బలహీనులు సపోటా తినమని సలహా ఇస్తారు. దీనిలో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి.
- ఇన్ఫెక్షన్ దూరం: సపోటా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌ను తొలగిస్తుంది. రోజూ సపోటా తినడం వల్ల లివర్ ఇన్ఫెక్షన్ తొలగిపోయి కాలేయం దృఢంగా మారుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..