Health: ఏదో షో కోసం పెంచే మొక్క అనుకునేరు.. అయ్యబాబోయ్ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్

|

Nov 23, 2024 | 10:05 AM

రణపాల మొక్క శాస్త్రీయ నామం బ్రయోఫిలం పినటం. అందం కోసం ఆరుబయట పెంచే ఈ మొక్కలో ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ మొక్కలో అనేక యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు మెండుగా ఉన్నాయి.

Health: ఏదో షో కోసం పెంచే మొక్క అనుకునేరు.. అయ్యబాబోయ్ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్
Ranapala Plant
Follow us on

ర‌ణ‌పాల శాస్త్రీయ మొక్క ఆకులు కాస్త మందంగా ఉంటాయి. తింటే వ‌గ‌రు, పులుపుగా అనిపిస్తాయి. ఈ మొక్క ఆకు ద్వారానే ప్ర‌త్యుత్ప‌త్తిని కొన‌సాగిస్తుంది. అంటే ఈ మొక్క ఆకుల‌ను నాటితే చాలు మొక్క మొలుస్తుంది. దీంతో ఇంటి ఆవ‌ర‌ణ‌లో సుల‌భంగా పెంచుకోవ‌చ్చు. ఈ మొక్క ఆకుల వల్ల బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… 

1. ర‌ణ‌పాయ ఆకులు కిడ్నీల స‌మ‌స్య‌లు, కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు చేస్తాయి. ఈ ఆకుల‌ను రోజూ ఉద‌యం, సాయంత్రం రెండు చొప్పున తినాలి. లేదా ఉద‌యం ఆకుల క‌షాయాన్ని 30 ఎంఎల్ మోతాదులో తాగ‌వ‌చ్చు. దీంతో కిడ్నీలు, బ్లాడ‌ర్‌లో ఉండే స్టోన్లు క‌రిగిపోతాయి.

2. ర‌ణ‌పాల ఆకుల‌ను తింటే ర‌క్తంలోని క్రియాటిన్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. ఇది డ‌యాలసిస్ రోగుల‌కు మేలు చేస్తుంది. మూత్ర‌పిండాల ప‌నితీరు మెరుగు ప‌డుతుంది.

3. రోజూ ఉద‌యం, సాయంత్రం ఈ ఆకులను 2 చొప్పున తింటుంటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంది. షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి.

4. ర‌ణ‌పాల ఆకుల‌ను తిన‌డం ద్వారా జీర్ణాశ‌యంలోని అల్స‌ర్లు త‌గ్గుతాయి. అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు

5. జ‌లుబు, ద‌గ్గు, విరేచ‌నాల‌ను న‌యం చేసే గుణాలు ఈ ఆకుల్లో ఉంటాయి. ఈ ఆకుల్లో యాంటీ పైరెటిక్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అందువ‌ల్ల మ‌లేరియా, టైఫాయిడ్ జ్వ‌రాలు వ‌చ్చిన వారు తీసుకుంటే హిత‌క‌రంగా ఉంటుంది.

6. ర‌ణ‌పాల ఆకుల‌ను తిన‌డం వల్ల హైబీపీ త‌గ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మూత్రంలో ర‌క్తం, చీము వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

7. ఈ ఆకుల‌ను తింటే జుట్టు రాల‌డం త‌గ్గుతుంద‌ది. తెల్ల వెంట్రుక‌లు రావ‌డం ఆగుతుంది.

8. ర‌ణ‌పాల ఆకుల‌ను పేస్ట్‌లా చేసి క‌ట్టు క‌డుతుంటే కొవ్వు గ‌డ్డ‌లు, వేడి కురుపులు త‌గ్గుతాయి. శ‌రీరంలో వాపులు త‌గ్గుతాయి.

9. కామెర్లు ఉన్న‌వారు రోజూ ఉద‌యం, సాయంత్రం ఈ ఆకుల ర‌సాన్ని 30 ఎంఎల్ మోతాదులో తీసుకోవాలి. దీంతో వ్యాధి న‌యం అవుతుంది.

10. ర‌ణ‌పాల ఆకుల ర‌సం ఒక్క చుక్క‌ను చెవిలో వేస్తే చెవిపోటు త‌గ్గుతుంది.

11. ర‌ణ‌పాల ఆకుల‌ను పేస్ట్‌లా చేసి నుదుటిపై ప‌ట్టీలా వేయాలి. త‌ల‌నొప్పి త‌గ్గుతుంది.

ఈ వివరాలు ఆరోగ్యం పట్ల మీ ప్రాథమిక అవగాహన కోసమే అని గమనించాలి. మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. ఆరోగ్య సమస్యలు ఎలాంటివి ఉన్నా వైద్యులను సంప్రదించండి…

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.