Pregnancy
గర్భధారణ సమయంలో మహిళలు తమ ఆరోగ్యం, బిడ్డ ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకునే ఆహారంతోపాటు పలు జాగ్రత్తలతోనే తల్లీ, బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటారు. అయితే, గర్భధారణ సమయంలో చలికాలంలో మహిళలు కొన్ని పదార్థాలు తినకూడదు. అటువంటి పరిస్థితిలో కొన్ని విషయాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. చలికాలంలో మహిళలు ప్రెగ్నెన్సీ (గర్భధారణ) సమయంలో ఎలాంటి పదార్థాలను తీసుకోకూడదు అనే వివరాలను ఇప్పుడు తెలుసుకోండి..
గర్భధారణ సమయంలో వీటిని తినకూడదు..
- గర్భధారణ సమయంలో మహిళలు పచ్చి బొప్పాయిని తినకూడదు. పచ్చి బొప్పాయి గర్భాశయాన్ని దెబ్బతీస్తుంది. కావున బొప్పాయికి దూరంగా ఉండాలి.
- గర్భధారణ సమయంలో మహిళలు పైనాపిల్ తినకూడదు. పైనాపిల్ తీసుకోవడం వల్ల వెన్నునొప్పి లేదా ప్రీమెచ్యూర్ డెలివరీ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.
- గర్భధారణ సమయంలో, మహిళలు శీతాకాలంలో ద్రాక్షను తినకూడదు. ఎందుకంటే ద్రాక్షలో రెస్వెరాట్రాల్ అనే సమ్మేళనం ఉంటుంది. దీని కారణంగా రక్తం ఇన్ఫెక్షన్ సమస్య వస్తుంది. అలాగే, ఇది శరీరంలో ఇతర సమస్యలను కలిగిస్తుంది.
- గర్భధారణ సమయంలో మహిళలు కెఫిన్ తీసుకోకూడదు. అధిక మొత్తంలో కెఫిన్ తీసుకోవడం పిల్లల ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, తల్లి ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
- గర్భధారణ సమయంలో స్త్రీలు పచ్చి గుడ్లను కూడా తినకూడదు. పచ్చి కోడిగుడ్లను తీసుకోవడం వల్ల శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. అయితే, గర్భధారణ సమయంలో గుడ్లు తినేటప్పుడు, వాటిని బాగా ఉడికించి తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..