Pregnancy Care: గర్భధారణ సమయంలో మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. గర్భధారణ సమయంలో మహిళ ఉద్యోగులు, ఇతర పనులు చేసేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. పెళ్లాయిన స్త్రీ గర్భం ధరించడం సహజమే. అయితే అలాంటి సమయంలో వారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది. లేకపోతే కడుపులో పెరిగే బిడ్డకు, తల్లికి ప్రమాదం ఉండే అవకాశం ఉంది. గర్భాధరణ సమయంలో స్త్రీ అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమస్యల కారణంగా కొన్నిసార్లు రోజువారీ పని చేయడం కష్టం అవుతుంది. మరోవైపు మహిళ (Woman) ఉద్యోగం చేస్తున్నట్లయితే ఆమె ఇంటి, కార్యాలయంలో రెండింటి బాధ్యతను నిర్వర్తించాలి. అటువంటి పరిస్థితిలో ముఖ్యంగా పని చేసే మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో పనిచేసే మహిళలు ఏయే విషయాలను గుర్తుంచుకోవాలో తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన ఆహారం తినండి: గర్భధారణ సమయంలో శరీరానికి చాలా పోషకాలు అవసరం. ఎందుకంటే కడుపులో పిండం అభివృద్ధి కూడా తల్లి ద్వారా జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో స్త్రీ మరింత ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. మార్కెట్‌లో వేయించిన వస్తువులకు దూరంగా ఉండాలి. లేకపోతే సమస్యను పెంచడానికి పని చేస్తాయి. అలాగే బిడ్డ దాని నుండి పోషకాహారాన్ని పొందలేరు. ఇందుకోసం ఇంటి నుంచే లంచ్‌ను సిద్ధం చేసుకుని తీసుకోండి. దీనితో పాటు షికంజీ, మఖానా, సలాడ్, ఫ్రూట్స్ వంటివి పెట్టుకుని ఎప్పుడో ఒకప్పుడు తింటూ ఉండండి. టీ, కాఫీలు మానుకోండి.
ప్రొటీన్లు, కాల్షియం, ఐరన్ అధికంగా ఉండే ఆహారం: మీ ఆహారంలో ప్రోటీన్, కాల్షియం, ఐరన్ అధికంగా ఉండే వాటిని చేర్చండి. దీని వల్ల మీకు అలసట తగ్గుతుంది. అలాగే మీ శరీరంలో రక్త కొరత ఉండదు. రక్తహీనతను నివారించడానికి నిపుణులు కొన్నిసార్లు గర్భధారణ సమయంలో సప్లిమెంట్లను ఇస్తారు.
నిరంతరం పని చేయవద్దు: కొందరు స్త్రీలు ఎక్కువ కాలం పని చేస్తూనే ఉంటారు. మీరు ఈ పరిస్థితిని నివారించాలి. లేకుంటే సమస్య పెరుగుతుంది. అందుకని పని మధ్యలో కాస్త విరామం తీసుకుని కాసేపు సీట్లోంచి లేచి నడవండి. కూర్చున్నప్పుడు చేతులు, కాళ్ళను తిప్పండి.
నీరు ఎక్కువగా తాగాలి: శరీరంలో నీటి కొరత ఏర్పడకుండా నీరు ఎక్కువగా తాగాలి. ఈ రోజుల్లో వేసవి కాలం ప్రారంభమైంది. అటువంటి పరిస్థితిలో శరీరంలో నీటి డిమాండ్ చాలా పెరుగుతుంది. గర్భిణులు దాహార్తి తీర్చుకునేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు కొబ్బరి నీరు, మజ్జిగ, పళ్ల రసాలు వంటివి తీసుకోవడం మంచిది.
పాదాలలో నొప్పి, వాపు సమస్యలు: ఆఫీసులో కుర్చీలో ఎక్కువ సేపు కూర్చోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో పాదాలలో నొప్పి, వాపు సమస్య ఉండవచ్చు. అలాంటి సమయంలో కూర్చోవడానికి వీలుగా ఉండే చైర్‌లను ఎంచుకోవాలి.
సరైన నిద్ర ఉండాలి: పని చేసిన తర్వాత అలసట వస్తుంటుంది. గర్బిణీ మహిళలు తగినంతగా నిద్రపోవాలి. నిద్రలేకపోతే అనారోగ్య సమస్యలువ వస్తాయి. మీకు సమయం ఉంటే మీరు కార్యాలయంలో కూడా కనీసం 15 నిమిషాల నిద్రపోవచ్చు. ఇలా గర్భిణీ మహిళలు గర్భం ధరించిన నాటి నుంచి ప్రసవం అయ్యే వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి.)
ఇవి కూడా చదవండి: