
శరీరానికి తగిన మోతాదులో నీరు అందినప్పుడు అధిక రక్తపోటు, షుగర్, గుండె సంబంధిత సమస్యలు, అధిక బరువు, మూత్రపిండాల సమస్యలు వంటి అనేక వ్యాధుల తీవ్రత తగ్గే అవకాశం ఉంది. అయితే కేవలం నీరు తాగడమే కాదు.. ప్రతి ఉదయం శరీరాన్ని శుభ్రపరచడం, వ్యర్థాలను బయటకు పంపడం, రోగనిరోధక శక్తిని పెంపొందించడం కోసం కొన్ని ప్రత్యేకమైన ఆరోగ్యకరమైన డ్రింక్స్ లను ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచిది.
రాత్రి నిద్రపోయే ముందు ఒక స్పూన్ మెంతులను ఒక గ్లాసు నీటిలో నానబెట్టి ఉంచండి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగి మెంతులను నమిలి తినండి. ఇది జీర్ణ సమస్యలు, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం వంటి సమస్యలకు మంచి పరిష్కారం. అదే సమయంలో మెటబాలిజాన్ని మెరుగుపరచడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.
తరచూ చెట్లలో కనిపించే దుర్వా గడ్డిని కొద్దిగా నీటిలో కలిపి రసం తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉంటాయి. ముఖ్యంగా గడ్డి కాండంలో ఔషధ గుణాలు ఉండటం వల్ల శరీరంలో వేడి తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అయితే ఆకులలో ఎక్కువ నీరు ఉండటం వల్ల కొందరికి అజీర్ణం లేదా విరేచనాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మితంగా తీసుకోవాలి.
బూడిద గుమ్మడికాయ రసం.. శరీర బరువు ఎక్కువగా ఉన్నవారు. పొట్ట చర్మాన్ని తగ్గించుకోవాలనుకునే వారు వారంలో రెండు లేదా మూడుసార్లు ఈ రసాన్ని తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఖాళీ కడుపుతో తీసుకుంటే శరీరంలో పేరుకున్న కొవ్వు మెల్లగా కరిగిపోతుంది. దీనిలో కొద్దిగా మిరియాల పొడి, పసుపు కలిపి తాగితే మెరుగైన ఫలితం లభిస్తుంది.
ఉదయం లేవగానే ఒక స్పూన్ ఆమ్లా రసం తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన విషాలను బయటకు పంపే శక్తి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి. జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. మలబద్ధకంతో బాధపడేవారికి ఇది చక్కటి పరిష్కారం. అంతేకాక శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి శక్తివంతమైన శరీరాన్ని అందిస్తుంది.
ఈ ఆరోగ్యకరమైన డ్రింక్ లను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరం శుభ్రంగా మారుతుంది, రోగనిరోధక శక్తి మెరుగవుతుంది, జీర్ణవ్యవస్థ బలపడుతుంది. కాబట్టి రోజూ కేవలం నీరు తాగడం కాకుండా ఈ ఆరోగ్యకరమైన డ్రింక్ లను కూడా మీ జీవనశైలిలో భాగంగా చేసుకోండి. రెగ్యులర్ గా అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండటమే కాదు. చాలా సమస్యలు ముందే దూరం అవుతాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)