Benefits of Peel: తొక్కే కదా అని పడేస్తున్నారా..! అయితే మీరు చాలా నష్టపోతున్నారు.. అవేంటో తెలుసుకోండి ..!

|

Jun 03, 2021 | 3:12 PM

మనలో చాలా మంది పండ్లు తిని పైతొక్క విసిరేస్తాం... అయితే, పండ్లు మీ ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రత్యేకత ఏమిటంటే ఈ పీల్స్ మిమ్మల్ని

Benefits of Peel: తొక్కే కదా అని పడేస్తున్నారా..! అయితే మీరు చాలా నష్టపోతున్నారు.. అవేంటో తెలుసుకోండి ..!
Potato Peel And Banana Peel
Follow us on

మనలో చాలా మంది పండ్లు తిని పైతొక్క విసిరేస్తాం… అయితే, పండ్లు మీ ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రత్యేకత ఏమిటంటే ఈ పీల్స్ మిమ్మల్ని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచడానికి సహాయపడతాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, బి6, బి12, ఏ, సి విటమిన్లు, మాంగనీస్, పొటాషియం, పీచు పదార్థాలు, ప్రొటీన్లు, మెగ్నీషియం,ప్రొటీన్లు ఉంటాయి. ఆరోగ్యానికి, అందానికి మేలు చేసే తొక్కల గురించి తెలుసుకుందాం..

బంగాళదుంప  తొక్క చేసే మేలు…

బంగాళాదుంపపై తొక్కలో కాల్షియం, విటమిన్ సి, బి కాంప్లెక్స్‌తో పాటు ఇనుము కూడా అధికంగా ఉంటాయి. మీరు ఇలాంటి వాటిని తినడం వల్ల శరీరంలో చాలా లోపాలను తొలిగిస్తాయి. చాలా వ్యాధులు మన నుంచి దూరంగా ఉంటాయి.   బంగాళాదుంపపై తొక్క బరువు తగ్గడానికి అధిక రక్తపోటు వంటి అనేక రోగాలకు దూరంగా ఉంచుతుంది. బంగాళాదుంప పై తొక్కలో కాల్షియం మరియు విటమిన్లు ఉంటాయి కాబట్టి, దాని వినియోగం ఎముకలను బలపరుస్తుంది. విటమిన్ బీ రోజంతా శరీరానికి బలం మరియు శక్తిని ఇస్తుంది. అందువల్ల మీరు ఇంట్లో చేసే బంగాళాదుంప కర్రీల్లో తొక్క తీయకుండేనే ప్రయత్నించండి. బంగాళాదుంప పై తొక్క తాజాగా లేదా ఎండినప్పటికీ ఇది పనిచేస్తుంది.

బంగాళాదుంపల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియను కూడా బలోపేతం చేస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కడుపు నొప్పి కలగదు. మలబద్ధకం సమస్య కూడా మాయమవుతుంది.  బంగాళాదుంప పై తొక్కలో పెద్ద మొత్తంలో ఇనుము ఉంటుంది. ఇది మీ శరీరంలో రక్తం లోపాన్ని తగ్గిస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ భోజనంలో బంగాళాదుంప పై తొక్కను ఉపయోగించాలి.

అరటి తొక్క చేసే మేలు..

అరటి తొక్క మీ ఆరోగ్యకరమైన జీవితానికి చాలా మేలు చేస్తుంది. మీ ఆహారంలో అరటి తొక్కను చేర్చడానికి  మీరు మొదట అరటి తొక్కను కడగాలి. గ్యాస్ మీద ఒక గ్లాసు నీరు వేసి అందులో అరటి తొక్క వేసి ఈ నీటిని పది నిమిషాలు బాగా ఉడకబెట్టి, ఆపై ఈ నీరు త్రాగాలి. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అంతే కాదు వాస్కులర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీరు అరటి తొక్కను మిక్సర్‌లో రుబ్బుకోవచ్చు. అరటి తొక్క పొడిని నీటిలో కలపుకుని ప్రతి ఉదయం త్రాగటం వల్ల కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అరటి తొక్కలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. తొక్కతో మొటిమలపై రుద్దితే తగ్గుముఖం పడతాయి.

ఇవి కూడా చదవండి: Kadamba Tree: రాధాకృషుల ప్రేమకు సాక్ష్యంగా.. దేవతలకు ఇష్టమైన వృక్షంగా నిలిచిన కదంబ విశిష్టత ఏమిటంటే..!