Packaged Food: ప్యాకేజ్డ్ ఫుడ్ ఆరోగ్యానికి హానిచేస్తుంది..ప్యాక్ చింపిన తరువాత ఆహారాన్ని నిలువ ఉంచితే ఏమవుతుందో తెలుసా?

|

Aug 01, 2021 | 2:49 PM

చిప్స్, కార్న్‌ఫ్లేక్స్, ఫ్రైడ్ మార్కెట్ స్నాక్స్, ఇంట్లో తయారుచేసిన చిప్స్ వంటి కరకరలాడే ఆహారాలు కాసేపు మూతపెట్టకుండా ఉంచితే తేమ చేరి మెత్తగా అయిపోతాయి. వర్షాకాలంలో ఇది తరచుగా జరుగుతుంది.

Packaged Food: ప్యాకేజ్డ్ ఫుడ్ ఆరోగ్యానికి హానిచేస్తుంది..ప్యాక్ చింపిన తరువాత ఆహారాన్ని నిలువ ఉంచితే ఏమవుతుందో తెలుసా?
Packaged Food
Follow us on

Packaged Food: చిప్స్, కార్న్‌ఫ్లేక్స్, ఫ్రైడ్ మార్కెట్ స్నాక్స్, ఇంట్లో తయారుచేసిన చిప్స్ వంటి కరకరలాడే ఆహారాలు కాసేపు మూతపెట్టకుండా ఉంచితే తేమ చేరి మెత్తగా అయిపోతాయి. వర్షాకాలంలో ఇది తరచుగా జరుగుతుంది. ఆ తర్వాత మనం వాటిని విసిరేస్తాము లేదా  ఒక్కోసారి వాటినే పాన్‌లో వేయించి,  మళ్లీ ఉపయోగిస్తాము. కానీ వర్షం లేదా తేమ కారణంగా మెత్తబడిన ఆహారాలు వాటి పోషకాలను కోల్పోతాయి. అప్పుడు అవి తినడానికి సరిపోవు. అవి  ఆరోగ్యానికి అంత మంచివి కావు.

తేమ వలన కనిపించని ఫంగస్ చేరుతుంది…

బ్రెడ్ వంటి కొన్ని ఆహారాలు, బయటపెట్టకుండా వదిలేస్తే, కాలక్రమేణా ఫంగస్ ఏర్పడుతుంది. చాలా సార్లు ఆ ఫంగస్ పైకి కనిపించదు. ఈ ఫంగస్ లు హానికరమైన టాక్సిన్స్ ఉత్పత్తి చేయగలవు. కాబట్టి వీటిని తినడం మానుకోవాలి.  చాలా ఫంగస్లకు జీవించడానికి ఆక్సిజన్ అవసరం, కాబట్టి అవి సాధారణంగా ఆక్సిజన్ పరిమితంగా ఉన్న చోట వృద్ధి చెందవు. అయితే, ఆహారాన్ని గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయకపోతే ఆహారం మీద ఫంగస్ త్వరగా పెరుగుతుంది.

ఆరోగ్యం కోల్పోవడం..

కొన్ని శిలీంధ్రాలు (ఫంగస్) అలెర్జీలు,  శ్వాస సంబంధిత సమస్యలను కలిగిస్తాయి. అనుకూలమైన పరిస్థితులలో, అవి ‘మైకోటాక్సిన్స్’ వంటి విషపూరిత పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. అది మనలను అనారోగ్యానికి గురి చేస్తుంది. అలాంటి ఆహారాలు తినడం వల్ల వికారం, విరేచనాలు, వాంతులు వంటి అనేక వ్యాధులు వస్తాయి. ఈ వ్యాధుల తీవ్రత బ్యాక్టీరియా/ఫంగస్ రకం , వ్యక్తి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

ఏమి చేయవచ్చు..

ఫంగస్ ఆహారంలోకి ప్రవేశించకుండా అన్ని ఆహార పదార్థాలను వాక్యూమ్ సీల్‌లో ఉంచండి. గట్టిగా మూసివేసిన కంటైనర్లలో విడిగా ఆహారాన్ని నిల్వ చేయండి. ఆహారాన్ని నిల్వ చేసిన తర్వాత కంటైనర్లు లేదా పర్సుల నుండి వీలైనంత ఎక్కువ గాలిని తొలగించండి. పాడయ్యే వస్తువులను రిఫ్రిజిరేటర్ లో రెండు గంటల కంటే ఎక్కువసేపు ఉంచవద్దు. ఫంగస్ పెరుగుదలను నివారించడానికి మూడు నుండి నాలుగు రోజుల్లో మిగిలిపోయిన స్నాక్స్ ఉపయోగించండి. రొట్టె, వండిన ఆహారాలు బూజుపట్టినట్లయితే, వాటిని బయటపడేయండి. చిప్స్ వంటి స్నాక్స్ చిన్న ప్యాక్‌లను కొనండి. తద్వారా వాటిని తెరిచిన తర్వాత ఒకేసారి తినడం పూర్తిచేయవచ్చు.  తినే సమయంలో అవసరానికి అనుగుణంగా మాత్రమే పాపాడ్‌లు లేదా ఇతర ఫ్రైయింగ్ ఐటమ్‌లను వేయించుకోవడం వలన నిలువ ఉంచే అవసరం తప్పుతుంది.

కరోనాలో ప్రత్యేక శ్రద్ధ

కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలని, చిప్స్, ఫ్రైస్ వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచించారు. సరైన పోషకాహారం,హైడ్రేషన్ ముఖ్యం. తగినంత నీరు త్రాగండి. బాగా సమతుల్య ఆహారం తీసుకునే వ్యక్తులు బలమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉంటారు. వారు దీర్ఘకాలిక వ్యాధులు, అంటు వ్యాధులకు తక్కువ అవకాశం కలిగి ఉంటారు. మీరు అనారోగ్యానికి గురయ్యే , రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేసే విధంగా ఉండే నిలువ ఉంచిన ఆహారపదార్ధాలు తినడాన్ని నివారించండి.

Also Read: Weight Loss : బరువు తగ్గేందుకు 5 చిట్కాలు.. కొన్ని వారాల్లోనే ఫలితం చూసి వాహ్ అనాల్సిందే

Beauty Tips : వర్షాకాలంలో జిడ్డు చర్మంతో బాధపడుతున్నారా..! ఈ 5 పద్దతులను పాటించండి మెరిసే అందం మీ సొంతం..